రాష్ట్రం అంతా సీసీ కెమెరాలు పెట్టలేం: sucharita

ABN , First Publish Date - 2021-08-16T16:36:30+05:30 IST

దిశ చట్టం వచ్చిన తర్వాత 58 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవుతుందని హోంమంత్రి సుచరిత తెలిపారు.

రాష్ట్రం అంతా సీసీ కెమెరాలు పెట్టలేం: sucharita

అమరావతి: దిశ చట్టం వచ్చిన తర్వాత 58 రోజుల్లోనే దర్యాప్తు పూర్తవుతుందని హోంమంత్రి సుచరిత తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎఫ్‌ఎస్‌ఎల్ ల్యాబ్‌లను తొందరగా ఏర్పాటు చేస్తామని..సీఎం నిధులు కూడా ఇచ్చారన్నారు. తాడేపల్లి ఘటనలో నిందితులను గుర్తించి ఒకరిని పట్టుకున్నామని...నిందితులను పట్టుకోవటం కష్టమైన ఒకరిని పట్టుకున్నామని చెప్పారు. సీఎం వెంటనే స్పందించి నిందితులను పట్టుకోమని పోలీసులను ఆదేశించారన్నారు. ఒక్క నిందితుడు కూడా తప్పించుకోవటానికి వీలు లేదని సీఎం చెప్పారని హోంమంత్రి తెలిపారు. పార్లమెంట్‌లో దిశ చట్టం అయితే ప్రత్యేక న్యాయ స్థానాలు అందుబాటులోకి వస్తాయన్నారు. సీసీకెమెరా ఫుటేజ్ ఆధారంగానే నిన్నటి ఘటనలో నిందితుడని అరెస్ట్ చేశామని అన్నారు. సురక్షితంగా లేని ప్రదేశాలకు మహిళలు వెళ్ళకూడదని  భావించాలని తెలిపారు. రాష్ట్రం అంతా సీసీ కెమెరాలు పెట్టలేమని స్పష్టం చేశారు. ప్రజలు కూడా వ్యక్తిగత భద్రత పాటించాలని హోంమంత్రి సుచరిత సూచించారు.


Updated Date - 2021-08-16T16:36:30+05:30 IST