Advertisement
Advertisement
Abn logo
Advertisement

పోలీసులకు వీక్లీ ఆఫ్ తొలగించలేదు: హోంమంత్రి Sucharita

గుంటూరు: పోలీసులకు వీక్లీ ఆఫ్ తొలగించలేదని హోంమంత్రి సుచరిత స్పష్టం చేశారు. కరోనా సమయంలో సిబ్బంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి విధులు నిర్వహించారని తెలిపారు. ఆయా జిల్లాల ఎస్పీలు సిబ్బందికిచ్చే వీక్లి ఆఫ్‌లు అమలు చేస్తారన్నారు.  మంగళవారం గుంటూరు తూర్పు తహశీల్దార్ కార్యాలయాన్ని హోంమంత్రి ప్రారంభించారు. 2009 లోనే తహాశీల్దారు కార్యాలయానికి శాంక్షన్ వచ్చిందన్నారు. ఇప్పుడు ప్రత్యేక భవనంలోకి మార్చామని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరించాలని సూచించారు. పెండింగ్‌లో ఫైల్స్ ఉంచకుండా ప్రజలకి సేవలందించాలని హోంమంత్రి సుచరిత తెలిపారు. 

Advertisement
Advertisement