పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

ABN , First Publish Date - 2020-05-29T09:24:46+05:30 IST

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు స్థాపించి ఎక్కువమంది స్థానికులకు ఉపాధి కల్పించేందుకు సీఎం జగన్‌ అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు.

పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం

 హోం మంత్రి మేకతోటి సుచరిత


గుంటూరు, మే 28 (ఆంధ్రజ్యోతి): ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో పరిశ్రమలు స్థాపించి ఎక్కువమంది స్థానికులకు ఉపాధి కల్పించేందుకు సీఎం జగన్‌ అనేక ప్రోత్సాహకాలు అందిస్తున్నారని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని శంకరన్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో మన పాలన - మీ సూచన నాల్గో రోజు కార్య క్ర మంలో పరిశ్రమలు - మౌలిక సదుపాయాలపై మేధోమథన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా హోం మంత్రి మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈలకు రావాల్సిన ప్రోత్సాహక బకాయిలను విడుదల చేసి సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు జీవం పోశారని తెలిపారు. రాష్ట్ర మద్య విమోచన ప్రచార కమిటీ చైౖర్మన్‌ వి.లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పరిశ్రమలకు ప్రో త్సాహక బకాయిలను రూ.38 కోట్లు అందించడం హర్ష ణీయమన్నారు. పొన్నూరు ఎమ్మెల్యే కిలారి రోశయ్య మాట్లాడుతూ ప్రతీ కుటుంబానికి మేలు జరిగేలా  అన్ని రకాల సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు.


గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే మద్ధాళి గిరిధర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేద ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో సీఎం జగన్‌ సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తు న్నారన్నారు. కార్యక్రమంలో పరిశ్రమల కేంద్రం మేనేజర్‌ ఏవీ పటేల్‌, హ్యాండ్‌లూమ్స్‌ ఏడీ వనజ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజర్‌ షేక్‌ బాజీబాబు, హౌసింగ్‌ పీడీ వేణుగోపాల్‌రావు, డ్వామా పీడీ శ్రీని వాసరెడ్డి తమ శాఖలకు సంబంధించిన కార్యకలాపాలు, పురోగతిని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, విడదల రజని,  జేసీ  పీ ప్రశాంతి, డీఆర్‌వో సత్యన్నారాయణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T09:24:46+05:30 IST