విదేశీయులకు కేంద్ర హోం శాఖ గుడ్‌న్యూస్.. కానీ

ABN , First Publish Date - 2021-10-09T06:25:38+05:30 IST

విదేశాల నుంచి భారత్ రావాలనుకుంటున్న వారికి కేంద్ర హోంశాఖ తీపికబురందించింది. ఇతర దేశాల నుంచి భారత్ రావాలనుకుంటున్న..

విదేశీయులకు కేంద్ర హోం శాఖ గుడ్‌న్యూస్.. కానీ

న్యూఢిల్లీ: విదేశాల నుంచి భారత్ రావాలనుకుంటున్న వారికి కేంద్ర హోంశాఖ తీపికబురందించింది. ఇతర దేశాల నుంచి భారత్ రావాలనుకుంటున్న వారిని అక్టోబర్ 15 నుంచి అనుమతులివ్వనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. అయితే చార్టర్డ్ విమానాలలో వచ్చే వారికి మాత్రమే ఈ ఆహ్వానమని మెలిక పెట్టింది. అలా కాకుండా ప్యాసెంజర్ విమానాల నుంచి రావాలనుకునే వారికి నవంబర్ 15 నుంచి అనుమతించే అవకాశం ఉందని వెల్లడించింది.


అయితే విదేశాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలకు కచ్చితంగా పాటించాలని హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అన్ని నిబంధనలనూ పాటించాల్సిందేనని, అందులో ఎవరికీ ఎలాంటి మినహాయింపులూ లేవని తేల్చి చెప్పింది. విమానం దిగిన ప్రదేశం నుంచే ఈ నిబంధనలు అమలవుతాయని చెప్పింది.


కాగా.. ఫారెన్ టూరిస్టులను భారత్‌లోకి అనుమతిస్తూ వీసాలు అందించనున్నట్లు కేంద్ర హోం శాఖ చేసిన ప్రకటనను టూర్ ఆపరేటర్స్, ట్రావెల్ సర్వీస్‌ సంస్థల నిర్వాహకులు స్వాగతించారు. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుందని అన్నారు. సాధారణ ప్యాసెంజర్ కమర్షియల్ విమానాలను కూడా అనుమతించాలని కోరారు. 

Updated Date - 2021-10-09T06:25:38+05:30 IST