ఇంట్లోనే కోవిడ్-19 పరీక్షలు, అర గంటలోనే ఫలితాలు!

ABN , First Publish Date - 2020-03-27T00:12:35+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. దగ్గు, జలుబు వచ్చినంత మాత్రానికి కోవిడ్-19 పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్తే, లేని రోగం ఎక్కడ అంటుకుంటుందోనని భయపడుతున్నారు

ఇంట్లోనే కోవిడ్-19 పరీక్షలు, అర గంటలోనే ఫలితాలు!

న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. దగ్గు, జలుబు వచ్చినంత మాత్రానికి కోవిడ్-19 పరీక్షల కోసం ఆసుపత్రికి వెళ్తే, లేని రోగం ఎక్కడ అంటుకుంటుందోనని  భయపడుతున్నారు. ఈ సందర్భంలో బ్రిటన్‌లోని మూడు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు కలిసి ఓ టెస్టింగ్ కిట్‌ను అభివృద్ధి చేశారు.  దీని ద్వారా ఇంట్లోనే పరీక్షలు చేసుకోవచ్చు, ఫలితాలు అర గంటలోనే తెలిసిపోతాయి.


బ్రూనే, లాంకస్టర్, సర్రే విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు ఈ పరికరాన్ని అభివృద్ధిపరిచారు. బ్యాటరీతో దీనిని పని చేయించవచ్చు. ముక్కు, గొంతు నుంచి వచ్చే ఉమ్ము, చీమిడిలను దీనిలో పెట్టి, పరీక్ష చేయవచ్చు. పరీక్షల ఫలితాలను ఈ పరికరానికి అమర్చిన స్మార్ట్‌ ఫోన్‌లోని యాప్‌కు అర గంటలోనే చేరుతాయి.  ఒక వ్యక్తికి కోవిడ్-19 పరీక్ష చేయడానికి రూ.350 ఖర్చవుతుందని పరిశోధకులు చెప్పారు. ఈ టెస్టింగ్ డివైస్ ధర సుమారు రూ.9,000 వరకు ఉండవచ్చునని తెలిపారు. 


ఈ టెస్టింగ్ కిట్‌ను వ్యాపారపరంగా అధిక సంఖ్యలో ఉత్పత్తి చేయడం కోసం కొన్ని కంపెనీలను సంప్రదించినట్లు ఈ పరిశోధకులు తెలిపారు. యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ, అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్, బ్రిటన్‌కు చెందిన మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ వంటి నియంత్రణ సంస్థల నుంచి అనుమతులు లభించిన తర్వాత ఈ టెస్టింగ్ కిట్ వ్యాపారాత్మకంగా ఉత్పత్తయ్యే అవకాశాలు ఉన్నాయి.


Updated Date - 2020-03-27T00:12:35+05:30 IST