వివాదాల నిలయం

ABN , First Publish Date - 2022-02-27T07:00:09+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చకపోవడంతో పాటు తర చూ ఏదో ఒక విషయంలో కేంద్ర బిందువుగా మారుతోంది. ఆరు నెలల కాలంలో నలుగురు రిజిస్ట్రార్‌లు తారుమారు అయ్యారంటే పరిస్థితి ఇట్టే స్పష్టమవుతుంది. పాలనా పర మైన నిర్ణయాలు తీసుకునే లోపే వారి బదిలీలు అశ్చర య్యానికి గురి చేస్తున్నాయి. స్వయంగా ఉన్న త విద్యా మండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ నియమించిన రిజిస్ట్రార్‌ యాదగిరిని గుట్టుచప్పుడు కాకుండా ఒకే నెల పరిధిలోనే తప్పించేలా ఒత్తిడి తెచ్చారని తెలుస్తుంది.

వివాదాల నిలయం
రిజిస్ట్రార్‌ల మార్పుపై ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ నుంచి వచ్చిన నోటీసు

అక్రమాలకు కేంద్ర బిందువుగా తెలంగాణ యూనివర్సిటీ!! 

ఉన్నత విద్యా మండలి ఆదేశాలు బేఖాతరు 

పైసలు ఇచ్చుకో.. పదవి పుచ్చుకో.. 

అంతర్గత బదిలీల్లో లీలాలు ఎన్నో.. 

ప్రొఫెసర్ల విభేదాల వల్లే వర్సిటీ పరువు బజారుకు.. 

చక్కదిద్దేందుకు వీసీ ప్రయత్నాలు 

ప్రక్షాలనలో భాగంగానే అంతర్గత బదిలీలు  

డిచ్‌పల్లి, ఫిబ్రవరి 26: తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యా ప్రమాణాలు మెరుగు పర్చకపోవడంతో పాటు తర చూ ఏదో ఒక విషయంలో కేంద్ర బిందువుగా మారుతోంది. ఆరు నెలల కాలంలో నలుగురు రిజిస్ట్రార్‌లు తారుమారు అయ్యారంటే పరిస్థితి ఇట్టే స్పష్టమవుతుంది. పాలనా పర మైన నిర్ణయాలు తీసుకునే లోపే వారి బదిలీలు అశ్చర య్యానికి గురి చేస్తున్నాయి. స్వయంగా ఉన్న త విద్యా మండలి కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ నియమించిన రిజిస్ట్రార్‌ యాదగిరిని గుట్టుచప్పుడు కాకుండా ఒకే నెల పరిధిలోనే తప్పించేలా ఒత్తిడి తెచ్చారని తెలుస్తుంది. ఈ విషయం వర్సిటీ ఈసీ మెంబర్‌లను కూడా కలవరపర్చింది. ఈ నేప థ్యంలో ఉన్నత విద్యా మండలికి సమాచారం లేకుండానే వర్సిటీ వీసీ రవీందర్‌ నూతన తాత్కలికి రిజి స్ట్రార్‌గా శివ శంకర్‌ను నియామకం చేశారు. ఇది తెలుసుకున్న ఉన్నత విద్యామండలి స్పందించి వీసీ, ఈసీ మెంటర్‌లకు తాము అందరి ఆమోదం మేరకు నియమించిన రిజిస్ట్రార్‌  యాద గిరి ఎందుకు తప్పించారో? వివరాలు సమగ్ర నివేదిక అం దజేయాలని కమిషనర్‌ వీసీ, ఈసీ మెంబలర్‌కు లేఖ పం పారు. డిసెంబరు 15న ఉన్నత విద్యా మండలి కమిషనర్‌ రిజిస్ట్రార్‌ తొలగింపు విషయంపై లేఖను పంపించారు. దీంతో ఉక్కిరిబిక్కిరి అయిన వీసీ, ఈసీ సభ్యులు సమాధా నం చెప్పకుండా మిన్నకుండి పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాత్కలిక రిజి స్ట్రార్‌గా కొనసాగుతున్న శివ శంకర్‌కు పాలనా పరమై న, వర్సిటీ ఆర్థిక పర మైన లావాదేవీల్లో జోక్యం చేసుకో రాదని కమిషన ర్‌ లేఖలో వెల్లడించా రు. కాని కమిషనర్‌ ఉత్తర్వులను పక్కన బెట్టి తమ సొంత నిర్ణాయలను వీసీ, రిజిస్ట్రార్‌లు తీసుకోవడంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. 

ఫ క్యాష్‌ పట్టు.. పోస్ట్‌ కొట్టు!!

వర్సిటీలో అంతర్గత బదిలీల విషయంలో క్యాష్‌ పట్టు పోస్ట్‌ కొట్టు అనేవిధంగా బదిలీలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాత్కలిక రిజిస్ట్రార్‌గా ఉన్న శివశంకర్‌ ఈసీ మీటింగ్‌లో ఈసీ మెంబర్స్‌ ఆమోదం ఉంటేనే ఆయ న కొనసాగే ఆవకాశం ఉంది. కానీ ఈసీ మీటింగ్‌ ఎప్పుడు పెడుతారనేది చర్చనీయాంశంగా మారింది. అది ఇప్పట్లో సమావేశం జరిగే అస్కారం లేదు. వర్సిటీలో ఓ ఉన్నతాధి కారి వర్సిటీలో పరిధిలోని 10 ఎకరాల విలువైన స్థలాన్ని తన పేర మార్చుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంపై వీసీ రవీందర్‌ గుప్తా మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో భూకబ్జాల అరో పణలు తన దృష్టికి రాలేదని, ఈ విషయాలను సమగ్రంగా వర్సిటీ అధికారుతో తెలుసుకుంటానని తెలిపారు. అంత ర్గత బదిలీల విషయంలో డబ్బుల ఆరోపణలు ఆవాస్తమని, పారదర్శకంగానే, సీనియరిటీ ప్రకారంగానే బదిలీలు, పదోన్నతులు జ రుగుతున్నాయన్నారు. కొందరు కావాల నే యూనివర్సిటీ ప్రతిష్టను అబాసు పాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, వచ్చే మార్చి నెలలో ఈసీ మీటింగ్‌ జరుగుతుందని వారు పేర్కొన్నారు.

Updated Date - 2022-02-27T07:00:09+05:30 IST