Abn logo
Jan 19 2021 @ 00:25AM

హోండా గ్రాజియా స్పోర్ట్స్‌ వెర్షన్‌

ధర రూ.82,564


న్యూఢిల్లీ: హోండా మోటార్‌ సైకిల్‌ అండ్‌ స్కూటర్స్‌ ఇండియా  (హెచ్‌ఎంఎస్‌ఐ).. గ్రాజియా స్కూటర్‌ స్పోర్ట్స్‌ వెర్షన్‌ను సోమవారం మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.82,564 (గురుగ్రామ్‌ ఎక్స్‌షోరూమ్‌). దీన్ని బీఎస్‌ 6 ప్రమాణాలు గల 125 సీసీ ఇంజన్‌తో అందిస్తున్నారు. సైడ్‌ స్టాండ్‌ ఇండికేటర్‌, ఇంజన్‌ కటాఫ్‌ వంటి కొత్త ఫీచర్లతో ఆకర్షణీయమైన రంగులు, గ్రాఫిక్స్‌ సహా సరికొత్త రూపంతో ఈ స్కూటర్‌ కొత్త వెర్షన్‌ అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అత్సుషి ఒగాటా తెలిపారు. యువత, నవ్యతను కోరుకునే తరం కోసం దీన్ని తయారుచేసినట్టు చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement