బీఎస్ 6 ప్రమాణాలతో వచ్చేసిన హోండా సివిక్ డీజిల్ వేరియంట్

ABN , First Publish Date - 2020-07-09T23:03:05+05:30 IST

హోండా కార్స్ ఇండియా మరో నయా కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈసారి బీఎస్ 6 ప్రమాణాలతో కూడి

బీఎస్ 6 ప్రమాణాలతో వచ్చేసిన హోండా సివిక్ డీజిల్ వేరియంట్

న్యూఢిల్లీ: హోండా కార్స్ ఇండియా మరో నయా కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈసారి బీఎస్ 6 ప్రమాణాలతో కూడి ‘సివిక్’ డీజిల్ వేరియంట్‌ను విడుదల చేసి డీజిల్ కార్లపై ఉన్న నిబద్ధతను చాటిచెప్పింది. దీని ధర రూ.20.74 లక్షలు. ఇందులో పెట్రోలు వేరియంట్‌ను గతేడాది మార్చిలో ప్రవేశపెట్టింది. ఎగ్జిక్యూటివ్ సెడాన్ విభాగంలో ఈ వెర్షన్‌ను ఎంచుకోవాలనుకునే వారికి కొత్త ఉద్గార నిబంధనలతో తీసుకొచ్చిన ఈ డీజిల్ ఇంజిన్ వాహనం మంచి ఆప్షన్ కాగలదు. ఇది లీటరు డీజిల్‌కు 23.9 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని హోండా పేర్కొంది. 1.6 లీటర్ ఐ-డీటీఈసీ టర్బో ఇంజిన్ గరిష్టంగా 118 హార్స్‌పవర్‌ వద్ద 4000 ఆర్పీఎం శక్తిని అందిస్తుంది. అలాగే, గరిష్ట టార్క్ 300 ఎన్ఎం కలిగి ఉంటుంది. వీఎక్స్ వేరియంట్ ధర రూ.20.74 లక్షలు కాగా, జెడ్ ఎక్స్ డీజిల్ వేరియంట్ ధర రూ. 22.34 లక్షలు. 

Updated Date - 2020-07-09T23:03:05+05:30 IST