వాటికి ఐదు కళ్లు... ఆరు కాళ్లు!

ABN , First Publish Date - 2020-11-30T06:31:44+05:30 IST

తేనె ఎలా వస్తుందో మీ అందరికీ తెలుసు. మరి ఆ తేనెటీగల విశేషాలు తెలుసా! తెలియకపోతే...

వాటికి ఐదు కళ్లు... ఆరు కాళ్లు!

తేనె ఎలా వస్తుందో మీ అందరికీ తెలుసు. మరి ఆ తేనెటీగల విశేషాలు తెలుసా! తెలియకపోతే ఇదిగో చదవండి. 


పక్షులు, జంతువులు, చిన్న చిన్న ఎగిరే కీటకాలు....ఇలా అన్నింటికి రెండే కళ్లు ఉంటాయి. కానీ తేనెటీగలకు మాత్రం ఐదు కళ్లు ఉంటాయి. ఆరు కాళ్లు ఉంటాయి. 

  1. తేనెటీగలు నివసించే ప్రదేశాన్ని హైవ్స్‌(కాలనీస్‌) అంటారు. ఈ కాలనీలలో నివసించే తేనెటీగలు మూడు రకాలుగా విభజించబడి ఉంటాయి. ఒకటి క్వీన్‌, రెండోది వర్కర్స్‌, మూడోది డ్రోన్స్‌.
  2. తేనెటీగలలో 20వేలకు పైగా రకాలున్నాయి. తేనెటీగలు ఎరుపు తప్ప అన్ని రంగులు చూడగలవు. వాసన ద్వారా పూలను గుర్తిస్తాయి.
  3. ఒక తేనెతుట్టెలో 50వేల వరకు తేనెటీగలు ఉంటాయి. 
  4. వర్కర్‌ బీస్‌ పువ్వుల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి. అవి ఒక ట్రిప్‌లో 50 - 100 పువ్వుల నుంచి మకరందాన్ని సేకరిస్తాయి.
  5. క్వీన్‌ బీస్‌ గుడ్లు పెడుతుంది. అవి సీజన్‌లో ఒకరోజుకి 2500 గుడ్లు పెడుతుంది. 
  6. తేనెటీగలు గంటకు 25 కి.మీ వేగంతో ఎగరగలవు. రెక్కలను సెకనుకు 200 సార్లు ఆడించగలవు. 

Updated Date - 2020-11-30T06:31:44+05:30 IST