గృహహింస కేసులో కోర్టుకు హాజరైన హనీ సింగ్

ABN , First Publish Date - 2021-09-03T21:02:45+05:30 IST

గృహ హింస కేసులో ప్రముఖ సింగర్ హనీ సింగ్ (హిర్దేష్ సింగ్) శుక్రవారంనాడు తీస్ హజారీ కోర్టు ముందు తన న్యాయవాదితో కలిసి ...

గృహహింస కేసులో కోర్టుకు హాజరైన హనీ సింగ్

న్యూఢిల్లీ: గృహ హింస కేసులో ప్రముఖ సింగర్ హనీ సింగ్ (హిర్దేష్ సింగ్) శుక్రవారంనాడు తీస్ హజారీ కోర్టు ముందు తన న్యాయవాదితో కలిసి హాజరయ్యారు. తాను శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురయ్యానని పేర్కొంటూ హనీ సింగ్ భార్య షాలిని తల్వార్ ఈ పిటిషన్ వేసింది. రూ.20 కోట్ల నష్టపరిహారం కోరింది. గత విచారణలో షాలిని తల్వార్ కోర్టులోనే కన్నీటి పర్యంతమైంది. పదేళ్లకు పైగా తాను భర్తను వెన్నంటే ఉండి సహకరించానని, కానీ తనను అతను ఏనాడూ పట్టించుకునే వాడు కాదని విచారణ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తనియా సింగ్‌ ముందు ఆమె వాపోయింది. ఆరోగ్య కారణాలతో వ్యక్తిగతంగా హాజరుకాలేనంటూ గత విచారణకు హనీ సింగ్ గైర్హాజరయ్యాడు. దీంతో వైద్య రికార్డులు, ఆదాయం పన్ను రిపోర్టులు వ్యక్తిగతంగా హాజరై కోర్టుకు సమర్పించాలని హనీసింగ్‌ను మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఆదేశించారు.


కాగా, తన భార్య చేసిన ఆరోపణల్లో ఎంతమాత్రం నిజం లేదని హనీసింగ్ చెబుతున్నారు. 20 ఏళ్లుగా తాన భార్యతో కలిసే ఉన్నానని, ప్రతి ఒక్కరికీ తమ అనుబంధం గురించి తెలుసునని అన్నారు. దశాబ్దానికి పైగా తన 'క్రూ'లో ఆమె కూడా ఉందని, షూటింగ్‌లు, ఈవెంట్లు, మీటింగులకు తనతోనే ఉండేదని అన్నారు. పదిహేనేళ్లుగా పరిశ్రమతో తనకు అనుబంధం ఉండటమే కాకుండా దేశంలోని అనేక మంది ఆర్టిస్టులు, మ్యుజిషియన్లో పనిచేశానని చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ పూర్తిగా నిరాధారమన్నారు. ఈ విషయం కోర్టు పరిధిలో ఉన్నందున ఇంతకు మించి ఏమీ చెప్పలేనని ఓ ప్రకనటలో పేర్కొన్నారు. దేశంలోని న్యాయవ్యవస్థప తనకు నమ్మకం ఉందని, నిజం త్వరలోనే బయటకు వస్తుందని అన్నారు.

Updated Date - 2021-09-03T21:02:45+05:30 IST