పర్‌ఫ్యూమ్‌ షాపులో హుక్కా ఫ్లేవర్స్‌ విక్రయం

ABN , First Publish Date - 2020-05-10T14:23:11+05:30 IST

లాక్‌డౌన్‌ నిబంధనలను పట్టించుకోకుండా పెర్‌ఫ్యూమ్‌ షాపు ముసుగులో హుక్కాపాట్

పర్‌ఫ్యూమ్‌ షాపులో హుక్కా ఫ్లేవర్స్‌ విక్రయం

హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ నిబంధనలను పట్టించుకోకుండా పెర్‌ఫ్యూమ్‌ షాపు ముసుగులో హుక్కాపాట్‌, ఫ్లేవర్లు అమ్ముతున్న వ్యక్తిని సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్ట్‌ చేశారు. నారాయణగూడ ప్రాంతానికి చెందిన మహ్మద్‌ అంజాద్‌ఖాన్‌(44) హిమాయత్‌నగర్‌లో సానియా పెర్‌ఫ్యూమ్స్‌ పేరిట సెంట్‌ దుకాణం నిర్వహిస్తున్నాడు. హుక్కా అలవాటున్న వారిని టార్గెట్‌ చేసుకొని తన దుకాణంలోనే హుక్కాపాట్‌లు, ఫ్లేవర్లు అధిక ధరలకు విక్రయిస్తున్నాడు. పక్కా సమాచారమందుకున్న సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దుకాణంపై దాడిచేసి 3 హుక్కాపాట్‌లు, 25 హుక్కా పైపులు, 12 హుక్కా ఫ్లేవర్లు, బొగ్గు, సిల్వర్‌ ఫాయిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడితోపాటు సామగ్రిని నారాయణగూడ పోలీసులకు అప్పగించారు.

Updated Date - 2020-05-10T14:23:11+05:30 IST