పబ్‌లో యువతికి పోకిరీల వేధింపులు

ABN , First Publish Date - 2021-12-23T01:51:24+05:30 IST

నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల

పబ్‌లో యువతికి పోకిరీల వేధింపులు

హైదరాబాద్: నగరంలోని జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గల క్లబ్ రోగ్ పబ్‌కి తన ఫ్రెండ్స్‌తో వెళ్లిన యువతిని పోకిరిలు వేధించారు. పబ్బులో వాలెట్ పార్కింగ్‌లో కారు కోసం ఎదురుచూస్తున్న యువతిని పోకిరీలు అసభ్యకరంగా దూషించారు. సదరు యువతి మీరు ఎవరు అని పోకిరీలను ప్రశ్నించింది. దీంతో మీ కారు మా కారు ఎక్స్చేంజ్ చేసుకుంటామంటూ మాటలు కలుపుతూ కారుని తగలబెడతాం అంటూ పోకిరీలు బెదిరించారు. పోకిరీల కారును ఎక్కడానికి యువతి తిరస్కరించింది. అంతేకాకుండా వారిని ప్రతిఘటించి తన కారులో ఎక్కి వెళ్లడానికి ప్రయత్నించింది. తన కారులో యువతి వెళుతుండగా కొద్ది దూరం కారును వెనక నుంచి ఆ యువకులు  వెంబడించారు. దీంతో ఆ యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేష‌లో ఫిర్యాదు చేసింది. 

Updated Date - 2021-12-23T01:51:24+05:30 IST