విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలి

ABN , First Publish Date - 2021-07-31T06:53:14+05:30 IST

నూతన విద్యావిధానం అమలులోకి తేవడం ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని పాఠశాల విద్య ఆర్జేడీ కే.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు.

విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలి
విద్యార్థి తండ్రి రంగయ్యకు బహుమతి అందజేస్తున్న డీఈవో

కనిగిరి, జూలై 30: నూతన విద్యావిధానం అమలులోకి తేవడం ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు చోటుచేసుకుంటాయని పాఠశాల విద్య ఆర్జేడీ కే.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. స్థానిక బ్రాహ్మణ కల్యాణ మండపంలో ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన విద్యా విధనాన్ని ఆచరణలోకి తెచ్చిన తొలి రాష్ట్రం మనదేనన్నారు. ప్రీ ప్రైమరీ స్థాయి నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అత్యంత నాణ్యమైన విద్య అందించటమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. జిల్లా విధ్యాశాఖాధికారి వీ.ఎస్‌ సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులకు కార్పోరేట్‌ కంటే మెరుగైన విద్య అందించేందుకు నూతన విద్యావిధానం తోడ్పతుందన్నారు.  ఒకే పాఠశాలలో సమీపదూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలల ప్రాంగణంలో ఆగస్టు 16 నుంచి నిర్వహించాల్సి ఉంటుందన్నారు. జిల్లాలో సుమారు 250 పాఠశాలలు నూతన విధానంలోకి మారుతాయని డీఈవో అన్నారు. నూతన విద్యా విధానంపై నిర్వహించిన కార్యశాలలో కందుకూరు ఉప విధ్యాశాఖాదికారి సామా సుబ్బారావు, డీసీఈఓ కార్యదర్శి వెంకారెడ్డి, సమగ్ర శిక్ష సీఎంవో రాజాల కొండారెడ్డి, ఆరు మండలాల యంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

 హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఎడ్యుకేషనల్‌ ఈపీఎఫ్‌ అనే ఎన్‌జీవో సంస్థ జిల్లాస్థాయిలో ప్రభుత్వ పాఠశాల్లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా పరీక్షలు నిర్వహించింది.  ఈఈ 2021 మెరిట్‌ టెస్ట్‌ను కోక్యూబ్స్‌ అసెస్మెంట్‌ అనే యాప్‌ ద్వారా విద్యార్థులకు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాఽఽధించిన విద్యార్థులు ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ అనే రెండుభాగాలుగా పరీక్షలను నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలకు 3283 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌ పరీక్ష రాశారన్నారు. ఈ పరీక్షల్లో జిల్లాస్థాయిలో ఐదుగురికి, డివిజన్‌ స్థాయిలో మూడు చొప్పున 12 మంది, మండలానికి మూడు చొప్పున జిల్లాలో 108 మంది అత్యుత్తమ ప్రతిభ కనపరిచారన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి నగదు బహుమతితో పాటు ప్రతి ఒక్కరికి ఇంటర్‌మీడియట్‌ పుస్తకాలు, ప్రశంసాపత్రం, జ్ఞాపికలు అందజేశారు. కార్యక్రమంలో కందుకూరు ఉపవిద్యాధికారి సామా సుబ్బారావు, డీసీఈబీ సెక్రటరీ వెంకారెడ్డి, సర్వశిక్షా అభియాన్‌ సీఎంవో రాజాల కొండారెడ్డి, వెలిగండ్ల ఎంఈవో పి.ప్రసాద్‌, హెచ్‌ఎంల సంఘం అద్యక్షుడు దేవిరెడ్డి రామిరెడ్డి, నారాయణరెడ్డి, ఈఈ సభ్యులు రవికుమార్‌, రాఘవ, శ్రీధర్‌, పద్మావతి, విద్యార్దులు, విద్యార్దుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-31T06:53:14+05:30 IST