భారత్‌తో బంధాల బలోపేతానికి కృషి: ఇజ్రాయెల్ నూతన విదేశాంగ మంత్రి

ABN , First Publish Date - 2021-06-15T04:59:17+05:30 IST

భారత్‌తో వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడం కోసం తాను కృషి చేస్తానని ఇజ్రాయెల్ నూతన విదేశాంగ మంత్రి, ప్రత్యామ్నాయ ప్రధాని యైర్ లాపిడ్ తెలిపారు.

భారత్‌తో బంధాల బలోపేతానికి కృషి: ఇజ్రాయెల్ నూతన విదేశాంగ మంత్రి

జెరూసలేం: భారత్‌తో వ్యూహాత్మక బంధాలను బలోపేతం చేయడం కోసం తాను కృషి చేస్తానని ఇజ్రాయెల్ నూతన విదేశాంగ మంత్రి, ప్రత్యామ్నాయ ప్రధాని యైర్ లాపిడ్ తెలిపారు. ఇజ్రాయెల్‌కు పన్నెండేళ్లపాటు అధ్యక్షుడిగా ఉన్న బెంజమిన్ నెతన్యాహూ తాజాగా అధికారం కోల్పోయిన సంగతి తెలిసిందే. నఫ్తాలీ బెన్నెట్ ఆధ్వర్యంలో ఇక్కడ నూతన ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో లాపిడ్ విదేశాంగ శాఖ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ ట్వీట్ చేశారు. దీనికి సమాధానం ఇచ్చిన లాపిడ్.. ‘‘మీతో కలిసి మన రెండు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్లడానికి కృషి చేయడానికి ప్రయత్నిస్తా. మిమ్మల్ని ఇజ్రాయెల్‌కు ఆహ్వానించడానికి ఎదురు చూస్తున్నా’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2021-06-15T04:59:17+05:30 IST