ఈ ఏడాది చివరి కల్లా కరోనా టీకా: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

ABN , First Publish Date - 2020-07-08T03:21:25+05:30 IST

ఈ ఏడాది చివరికల్లా కరోనా టీకా అందుబాటులోకి రావాలని తాము ఆశిస్తున్నట్టు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదర్ పూనావాలా మంగళవారం నాడు తెలిపారు.

ఈ ఏడాది చివరి కల్లా కరోనా టీకా: సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా

న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరికల్లా కరోనా టీకా అందుబాటులోకి రావాలని తాము ఆశిస్తున్నట్టు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదర్ పూనావాలా మంగళవారం నాడు తెలిపారు. అయితే ఈ విషయంలో తామేమీ తొందరపడటం లేదని, ప్రజల భద్రతే తమకు ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు. ఆక్సఫర్డ్ యూనివర్శిటీ సారథ్యంలో తయారవుతున్న కరోనా టీకాను భారత్‌లో తయారు చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రాజెన్కాతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ టీకాకు సంబంధించి మానవులపై జరుగుతున్న పరీక్షలు ప్రస్తుతం ఫేజ్-3 దశలో ఉన్నాయి. కాగా..చైనాకు చెందిన సైనోవాక్ సంస్థ తయారు చేసిన టీకా కూడా ఇటీవలే మూడో దశకు చేరుకుంది. ఇరు సంస్థలూ బ్రెజిల్‌లో తమ ట్రయల్స్‌ను చేపడుతున్నాయి.  

Updated Date - 2020-07-08T03:21:25+05:30 IST