హోలీ మంటలు అంటుకుని ముగ్గురు చిన్నారులు మృతి

ABN , First Publish Date - 2021-03-29T16:31:50+05:30 IST

బీహార్‌లో జరిగిన హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది.

హోలీ మంటలు అంటుకుని ముగ్గురు చిన్నారులు మృతి

గయ: బీహార్‌లో జరిగిన హోలీ వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం అర్థరాత్రి హోలికా దహనం నిర్వహిస్తున్న సమయంలో మంటలు చెలరేగి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం బోధ్‌గయ పోలీస్ స్టేషన్ పరిధిలోని మన్‌కోసి గ్రామంలో ఆదివారం రాత్రి హోలికా దహన కార్యక్రమం నిర్వహించారు. 


ఈ సందర్భంగా అక్కడున్నవారు మంటల్లోకి కర్రలు విసురుతుండగా, నలుగురు చిన్నారులకు మంటలు అంటుకున్నాయి. వీరిలో ముగ్గురు చిన్నారులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరొక చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతులను రోహిత్ కుమార్(12), నందలాల్ మంఝీ(13), ఉపేంద్ర కుమార్(12)గా గుర్తించారు. ఈ రోజు ఉదయం మృతులకు వారి కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటనపై ఇంతవరకూ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని భోధగయ పోలీస్ ఇన్‌స్పెక్టర్ మితేష్ కుమార్ తెలిపారు.

Updated Date - 2021-03-29T16:31:50+05:30 IST