Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉద్యాన విద్యార్థులు ప్రతిభ చూపాలి

 రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ డాక్టర్‌ హేమ చంద్రారెడ్డి

తాడేపల్లిగూడెం, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వ్యవసాయ, ఉద్యా న పంటలకు ప్రాధాన్యం పెరిగిందని ఈ రెండు రంగాల్లోనూ విద్యార్థులు ప్రతి భ చూపాలని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ డాక్టర్‌ హేమ చంద్రారెడ్డి సూచించారు. వెంకట్రామన్నగూడెం డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ వర్సిటీలో శుక్రవారం నిర్వహించిన వ్యవసాయ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఇంగ్లీష్‌ ల్యాబ్‌ను ప్రారంభించారు. వర్సిటీలో జాతీయ సేవా పథకాన్ని  విజయవంతంగా నిర్వ హిస్తున్న డాక్టర్‌ సీఎన్‌ బాయన్న, డాక్టర్‌ బి.తనూజా ప్రియకు అవార్డులను ప్రదానం చేశారు. వీసీ డాక్టర్‌ టి.జానకి రామ్‌, రిజిస్ర్టార్‌ డాక్టర్‌ బి.గోపాల్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎక్స్‌టెన్షన్‌ డాక్టర్‌ బి.శ్రీనివా సులు, డీన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ డాక్టర్‌  పద్మావతమ్మ, పరిశోధనా సంచాలకులు డాక్టర్‌ ఆర్‌వీఎస్‌కె రెడ్డి, స్టూడెంట్స్‌ అఫైర్స్‌ డీన్‌ డాక్టర్‌ ఎ.సుజాత తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement