శాస్త్ర సాంకేతికతలో ఉద్యాన వర్సిటీ ముందంజ

ABN , First Publish Date - 2021-06-22T07:24:26+05:30 IST

శాస్త్ర సాంకేతిక పద్ధ తులను ప్రయోగించి రైతు సమస్యల పరిష్కారంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ తెలిపారు.

శాస్త్ర సాంకేతికతలో ఉద్యాన వర్సిటీ ముందంజ
కమిషనర్‌కు వివరిస్తున్న వీసీ

తాడేపల్లిగూడెం, జూన్‌ 21 (ఆంధ్ర జ్యోతి): శాస్త్ర సాంకేతిక పద్ధ తులను ప్రయోగించి రైతు సమస్యల పరిష్కారంలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం విశేష కృషి చేస్తోందని రాష్ట్ర ఉద్యానశాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ తెలిపారు. ఉద్యాన వర్సిటీని సోమవారం ఆయ న తొలిసారిగా సందర్శించారు. టమాటాలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఉత్పత్తులను తయారు చేయడంలో విశ్వవిద్యాలయం చేస్తున్న కృషిని అభినందించారు. మిర్చిలో హైబ్రిడ్‌ విత్తనాలను తయారు చేసి ప్రైవేట్‌ కంపెనీలకు దీటుగా రైతులకు విత్తనాలు అందించడంలో ఉద్యాన విశ్వవిద్యాలయం సత్ఫలితాలు సాధించిందని కమిషనర్‌ వివరించారు. ప్రయోగశాల నుంచి రైతులకు విత్తనాలు, మొక్కలు అందేలా మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని  తెలిపారు. వీసీ డాక్టర్‌ టి.జానకిరామ్‌ మాట్లాడుతూ  పంటకోత అనంతరం ఉద్యాన ఉత్పత్తులు నిల్వ చేసుకునే పరిజ్ఞానా న్ని రైతులకు అందజేయడంలో విశ్వవిద్యాలయం ముందుంటుందని తెలిపారు. 


Updated Date - 2021-06-22T07:24:26+05:30 IST