గాంధీలో 1,209 మందికి చికిత్స

ABN , First Publish Date - 2021-05-09T05:30:00+05:30 IST

వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలోనే ‘గాంధీ’ బాట పడుతున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి ఆస్పత్రిలో 1,209 మంది చికిత్స పొందుతుండగా, 102మంది డిశ్చార్జి అయ్యారు.

గాంధీలో 1,209 మందికి చికిత్స

అడ్డగుట్ట, మే 9 (ఆంధ్రజ్యోతి): వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలోనే ‘గాంధీ’ బాట పడుతున్నారు. ఆదివారం సాయంత్రం నాటికి ఆస్పత్రిలో 1,209 మంది చికిత్స పొందుతుండగా, 102మంది డిశ్చార్జి అయ్యారు.  సాయంత్రం అయిందంటే చాలు గాంధీ ఆస్పత్రిలోని క్వాజువాలిటీ వార్డు వద్ద అంబులెన్స్‌లు క్యూ కడుతున్నాయి. 

ఆస్పత్రి బయటే సహాయకులు  

గాంధీలో చికిత్స పొందుతున్న కొవిడ్‌ బాధితులకు ఇంటి భోజనం ఇచ్చేందుకు సహాయకులు, కుటుంబ సభ్యులు ఆస్పత్రి బయటే ఉంటున్నారు. ఆస్పత్రి ఎదురుగా పోలీస్‌ ఔట్‌పోస్ట్‌ పోలీసులు సహాయకుల్ని ఎవరిని కూడా లోపలికి అనుమతి ఇవ్వడం లేదు. దాంతో ఉదయాన్నే పెద్ద సంఖ్యలో సహాయకుల కుటుంబ సభ్యులు బారులు తీరుతున్నారు.  


Updated Date - 2021-05-09T05:30:00+05:30 IST