Abn logo
May 17 2021 @ 00:02AM

ఏమైందీ వైద్యశాలకు..

వైద్యాధికారుల తీరుతో భద్రాచలం ఆసుపత్రి ప్రతిష్టకు మసక

భద్రాచలం, మే 16: భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు రాష్ట్రంలోనే కాదు, జాతీయస్థాయిలోనే ఎంతో పేరుంది. ఘన చరిత్ర కలిగిన ఈ వైద్యశాలపై అవినీతి, అవకతవకల ఆరోపణలు ఇటీవల తరుచూ వస్తున్నాయి. కరోనా బాధితులకు అత్యవసర పరిస్థితుల్లో వినియో గించాల్సిన రెమిడెసివిర్‌ ఇంజెక్షన్లు పక్కదారి పట్టాయి. ఈ విషయంలో పోలీసులు విచారణ చేపట్టి ఇప్పటికే ఇద్దరు డాక్టర్లు, ఒక ఫార్మాసిస్టుపై కేసు నమోదు చేశారు. దీంతో ఈ వైద్యశాల ప్రతిష్ట మసకబారింది. ఈ విషయం మరిచిపోక ముందే ఏరియా వైద్యశాలలో పని చేస్తున్న ఇరువురు వైద్యులు అనధికారికంగా గైర్హాజరవుతు న్నా రనే ఆరోపణలు వెల్లువెత్తడం గమనార్హం. ఇందులో ప్రధానంగా వైద్యశాలలో కీలక విభాగానికి చెందిన ఒక వైద్యుడు కొన్ని నెలలుగా భద్రాచలంలో సైతం ఉండకుం డా మరో చోట ఉంటున్నా ఈ విషయం కనీసం అధికా రులు గుర్తించకపోవడం వారి పనితీరుకు మచ్చుతునక అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. భద్రాచలంలోని బ్రిడ్జి రోడ్డులో గతంలో ప్రైవేటు వైద్యశాలను నిర్వహించిన ఆ వైద్యుడు దానిని తీసివేసి మరో చోటకు తరలివెళ్లినట్లు ప్రచారం సాగుతోంది. ఈ క్రమంల కొంత కాలంగా విధులకు గైర్హాజరైనా ఏ ఒక్కరూ ఈ విషయాన్ని ప్రస్తా వించకపోవడం పట్ల పలు అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. అదే రీతిలో మరో వైద్యురాలు తమ విధు లకు గైర్హాజరైనట్లు వినికిడి. కాగా పరిపాలనపరంగా కొన్ని అవకతవకలు సైతం కొంత కాలంగా జరిగా యనే ఆరోపణలు వైద్యశాల వర్గాల నుంచే వ్యక్తమవుతుండటం గమనార్హం. 

ఇంతకీ ఆ పోస్టును ఎందుకు వద్దంటున్నారు

భద్రాచలం వైద్యశాలలో సూపరింటెండెంట్‌ పోస్టు ఎంతో కీలకం. పేరుకు 200 పడకల వైద్యశాల అయినా 230 వరకు రోగులకు కొన్నేళ్లుగా వైద్య సేవలంది స్తు న్నారు. తెలంగాణ  రోగులకే కాకుండా సరిహద్దు ప్రాం తంలోని ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారికి ఇక్కడ అత్యవసర సమయాల్లో చికిత్స నిర్వహి స్తున్నారు. ఇంతటి కీలకమైన ఈ వైద్యశాల పర్యవేక్షణ బాధ్యతలు పూర్తిస్థాయిలో చేపట్టేందుకు భద్రాచలం ఏరి యా వైద్యశాలలో పని చేస్తున్న వైద్యులు ఎందుకు వి ముఖత చూపుతున్నారో ఎవరికీ అంతుపట్టడం లేదు. మొన్నటి వరకు సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ చావా యుగంధర్‌ సస్పెండ్‌ కావడంతో ఆయన స్థానంలో సూ పరింటెండెంట్‌ను నియమించేందుకు జిల్లా అధికారులకు పెద్ద కసరత్తే చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరువురు వైద్యులు మాకు ఈ పోస్టు వద్దంటూ లిఖితపూర్వకంగా లేఖ సమర్పించారు. అయినా అందులో ఒకరికి సూ పరింటెండెంట్‌ పోస్టు అప్పగించినా పది రోజులు గడవ క ముందే ఒక కరోనా బాధితురాలికి సత్వరం వైద్యం అందించలేదనే ఆరోపణలతో పక్కన పెట్టారు. అనం తరం మళ్లీ వైద్యశాలలో పర్యవేక్షకుడి నియామకం కోసం మంతనాలు, చర్చలు సాగడం చివరకు జిల్లా కలెక్టరు ఎంవీరెడ్డి స్వయంగా కలుగజేసుకొని డీసీహెచ్‌నే ఆ బా ధ్యతలు చేపట్టాలని సూచించారు. అలాగే క్షేత్రస్థాయిలో వైద్యశాల పర్యవేక్షణకు డిప్యుటీ సూపరింటెండెంట్‌ పోసు ్టను తొలిసారి ఏర్పాటు చేసి డాక్టర్‌ రామకృష్ణను నియ మించారు. ఇంత జరిగినా వైద్యశాలపై ఇంకా విమర్శలు వస్తుండటం గమనించదగ్గ విషయం.

ఎందుకీ వ్యత్యాసం

కరోనా వైరస్‌ బారిన అధిక సంఖ్యలో ప్రజలు పడుతున్న క్రమంలో వారికి మెరుగైన వైద్యం తప్పక అందించాల్సిందే. వైద్యులకేమో ఒక రోజు విధుల కేటా యింపు, అందులో పని చేస్తున్న సిబ్బందికి ప్రతి రోజు విధులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేస్తుం డటం పట్ల ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. వైద్యశాలలో రాత్రిపూట పని చేస్తున్న వారికి పూర్తిస్థాయిలో కరోనా రక్షణాత్మక చర్యలు చేపట్టకపోవడంతో వారు ఇబ్బం దులకు గురవుతున్నారని తెలుస్తోంది. పూర్తిస్థాయిలో పీపీఈ కిట్లు, ఎన్‌-95 మాస్కు, ఫేస్‌షీల్డు, శానిటైజర్లు సైతం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇ టీవల శానిటైజరు లేకపోవడంతో సిబ్బంది స్పిరిట్‌తో చేతులు కడుక్కున్నారంటే పరిస్థితి ఏ రీతిన ఉందో అర్దం చేసుకోవాలని వైద్యశాల సిబ్బంది వాపోతున్నారు. కాగా ఆయుష్‌ సిబ్బందికి కొత్తగూడెంలో రోజు విడిచి రోజు విధులు కేటాయిస్తుండగా భద్రాచలంలో వారం మొత్తం పని చేయాల్సిందేనని ఒత్తిడి తెస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో అక్కడ పని చేస్తున్న సిబ్బంది తీవ్ర మానసిక, శారీరక ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు వినికిడి. ఇప్పటికే అందులో పని చేసే ఒక సిబ్బందికి కరోనా పా జిటివ్‌ వచ్చినట్లు సమాచారం. కాగా వైద్యశాలలో పని చే సే సిబ్బందిలో కొంత మందికికరోనా వార్డులో విధులు కేటాయించడం లేదని ఆయుష్‌ సిబ్బందితోనే రాత్రి స మయాల్లో పనులు చేయిస్తున్నారనే ఆరోపణలు వ్య క్తమవుతున్నాయి. సిబ్బందికి పూర్తిస్తాయిలో పట్టు, శిక్షణ లేకపోయినా వారిచే కరోనా బాధితులకు వివిధ రకా లపనులు చేయిస్తుండటంతో ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరనే  ప్రశ్న వైద్య సిబ్బంది వర్గాల నుంచే వ్యక్తమవుతోంది.

Advertisement