ఏదయా.. దయ?

ABN , First Publish Date - 2021-05-18T05:35:20+05:30 IST

భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ వైద్యశాలలో తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు వైద్యం కోసం వస్తుంటారు.

ఏదయా.. దయ?

భద్రాచలం ఏరియా ఆసుపత్రిపై సర్కారు శీతకన్ను

సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులు, డిప్యూటీ సివిల్‌ సర్జన్‌ పోస్టులన్నీ ఖాళీయే

వివిధ విభాగాల్లోనూ 133 పోస్టులు కూడా..

ఏళ్లు గడుస్తున్నా నిర్లక్ష్య ధోరణిలోనే

అమాత్యుడి కరుణ కోసం ఎదురుచూపు

భద్రాచలం, మే 17: భద్రాచలంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు ఎంతో ఘన చరిత్ర ఉంది. ఇక్కడ వైద్యశాలలో తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారు వైద్యం కోసం వస్తుంటారు. అంతటి ప్రాధాన్యం గల ఈ వైద్యశాలలో ఖాళీ పోస్టుల భర్తీ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించ కపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు వైద్యులు, ఇటు సిబ్బంది లేకుండా ని రుపేదలకు మెరుగైన వైద్యం అందేదెలా అని రాజకీయ పక్షాలు, వివిధ సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. భద్రాచలం ఏరియా వైద్యశాలలో మొత్తం 205 పోస్టులు మం జూరు కాగా ఇందులో 54 పోస్టులు భర్తీ అయ్యాయి. కాంట్రాక్టు పద్దతిన ఆరుగురు, అవుట్‌ సోర్సింగ్‌లో 12 మంది మొత్తం 72 మంది విధులు నిర్వహిస్తున్నారు. కాగా 133 పోస్టులు ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్నాయి. భద్రాచలం ఏరియా వైద్యశాలలో 13 వేల కిలోల లిక్విడ్‌ ఆక్సిజన్‌ ప్లాంటును ప్రారంభించేందుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ మంగళ వారం వస్తున్న క్రమంలో కరోనా విలయతాండవం చేస్తున్న ఈ సమయంలో పోస్టుల భర్తీకి మంత్రి అజ య్‌కుమార్‌ చొరవ తీసుకోవాలని ప్రజా ప్రతినిధులు, రాజ కీయపక్షాల నాయకులు అభ్యర్థిస్తున్నారు. 

కొవిడ్‌ సమయంలోనూ ఇబ్బందులే 

భద్రాచలం ఏరియా వైద్యశాలలో పూర్తిస్థాయిలో వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో అధికా రులు ప్రత్యా మ్నాయ చర్యలపై దృష్టిసారించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇందులో భాగంగా వివిధ విభాగాల స్పెషలిస్టులను సైతం కొవిడ్‌ విధులకు నియమించగా వైద్యశాలలో తగినంత సిబ్బంది లేకపోవడంతో ఆయుష్‌ విభాగంతో పాటు ఇతర చోట్ల నుంచి సిబ్బంది డిప్యుటేషన్‌ ప్రాతిపదికన తీసుకొ చ్చారు. అయినా ప్రస్తుతం ఉన్న సిబ్బంది సైతం కొవిడ్‌ సేవలు అందించేందుకు పూర్తిస్థాయిలో సరిపోని పరిస్థితి ఉందని తెలుస్తోంది. 143 ఆక్సిజన్‌ బెడ్లతో వైద్యశాలలో కరో నా బాధితులకు చికిత్స అందిస్తున్నారు. రోజు 300లకు పై గా ఓపీలో కరోనా బాధితులు చికిత్స కోసం వస్తున్న ప రిస్థితులు ఉన్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అ ర్థం చేసుకోవచ్చు. ఉమ్మడి జిల్లాకే తలమానికంగా ఉన్న ఈ వైద్యశాలకు వైద్యులు సిబ్బందిని సత్వరమే నియమిం చాలని ఇప్పటికే పలుమార్లు భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీ రయ్య ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.  అసెంబ్లీ సాక్షిగా సై తం ఈ అంశాన్ని ప్రస్తా వించ డంతో, ఆసుపత్రిని పూ ర్తిస్థాయిలో అభివృద్ది చేసేందుకు తగిన చర్యలు తీసుకో వాలని ఆయన కోరారు. అయినా ప్రభుత్వం పట్టించు కోకపోవడం పట్ల సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. 

వైద్యశాలలో ఖాళీలు 133

భద్రాచలం ప్రభుత్వ వైద్యశాలలో 205 పోస్టులకు గాను 72 పోస్టులు భర్తీ కాగా 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ప్రధానంగా సివిల్‌ సర్జన్‌ స్పెషలిస్టులు 16 మం జూరు కాగా 16 ఖాళీగా ఉండటం గమనార్హం. డిప్యుటీ సివి ల్‌ సర్జన్‌లు ఎనిమిది పోస్టులు మంజూరు కాగా ఎ నిమిది ఖాళీగా ఉన్నాయి. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 36 మంజూరు కాగా 17 ఖాళీగా ఉన్నాయి. స్టాఫ్‌ నర్సు పో స్టు లు 53 మంజూరు కాగా 45 ఖాళీగా ఉండటం గమనార్హం. ఏఎన్‌ఎం/ఎంపీహెచ్‌ఎ ఫిమేల్‌ ఏడు పోస్టులు మంజూరు కాగా ఐదు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వా స్తవా నికి ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నా అవుట్‌సోర్సింగ్‌ పద్ధతిలో ఇరువురు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఫార్మాసిస్టు గ్రేడ్‌-2 పోస్టులు ఏడు ఉండగా ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ల్యాబ్‌ టెక్ని షియన్‌ పోస్టులు ఏడు మంజూరు కాగా రెండు అ వుట్‌సోర్సింగ్‌ పద్ధతిన భర్తీ చేయగా ఐదు ఖాళీగా ఉన్నా యి. స్వీపర్‌/దోతీ పోస్టులు ఏడు ఉండగా మూడు ఖాళీగా ఉన్నాయి. 

ప్రభుత్వ తీరు సమంజసం కాదు 

పొదెం వీరయ్య, వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ 

భద్రాచలం ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో ఏళ్ల తరబడి 133 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా సివి ల్‌ సర్జన్‌ స్పెషలిస్టులు, డిప్యుటీ సివిల్‌ సర్జన్లు, ఇతర వైద్యు లు, సిబ్బంది పోస్టులు అధిక సంఖ్యలో ఖాళీగా ఉన్నా ప్రభు త్వానికి చీమకుట్టినట్లు కూడా లేదు. ఖాళీలను భర్తీ చేయా లని ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి లేఖలో రాసి కోరాను. అంతే కాదు అసెంబ్లీ వేదికగా సమస్యలను సభ దృష్టికి తెచ్చినా ప్రభుత్వం స్పందించకపోవడం సహేతుకం కాదు. కొవిడ్‌ సమయంలో అయినా వైద్యులు, సిబ్బంది ఖా ళీలను భర్తీ చేసేందుకు చొరవ చూపాలి. ఇలా వైద్యశాల లో వివిధ పోస్టులు ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించకపోవడం దారుణం.

Updated Date - 2021-05-18T05:35:20+05:30 IST