అమాత్యుల దందాలకే ఆస్పత్రి తరలింపు

ABN , First Publish Date - 2021-06-21T05:01:17+05:30 IST

అలంపూరుకు మంజూరైన వంద పడకల ఆస్పత్రిని అడ్డుకోవడంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహాం తమ దందాల కోసమే వందపడకల ఆస్పత్రిని అలంపూరు ఏర్పాటు చేయకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు.

అమాత్యుల దందాలకే ఆస్పత్రి తరలింపు
సమావేశంలో మాట్లాడుతున్న అఖిలపక్షం నాయకులు

-  మంత్రి, ఎమ్మెల్యే దందాలకే వంద పడకల ఆస్పత్రి తరలింపు 

రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకు మంత్రి, ఎమ్మెల్యే అండదండలు 

 ఉద్యమాలకు, ధర్నాలకు సిద్దమవుదాం

ఆలయాలకు వచ్చే ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులను అడ్డుకుందాం

 టీఆర్‌ఎస్‌ నాయకులు పదవులకు రాజీనామా చేయాలి 

 అఖిలపక్షం నేతల డిమాండ్‌


అలంపూరు, జూన్‌ 20 : అలంపూరుకు మంజూరైన వంద పడకల ఆస్పత్రిని అడ్డుకోవడంలో మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్యే అబ్రహాం తమ దందాల కోసమే వందపడకల ఆస్పత్రిని అలంపూరు ఏర్పాటు చేయకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని అఖిలపక్షం నాయకులు ఆరోపించారు. ఆదివారం అలంపూరు పట్ట ణంలోని రైతుసంఘం కార్యాలయంలో రైతుసంఘం నాయకులు రాజన్న అధ్యక్ష తన అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ తాలూకా ఇన్‌చార్జ్‌ ఆంజనేయులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకుపోయే విధంగా ధర్నాలు, ఉద్యమాలు చేపడతామన్నారు. సీపీఎం నాయకులు రేపల్లె దేవదాసు మాట్లాడుతూ  అన్ని పార్టీల ఆధ్వర్యంలో వంద పడకల ఆస్పత్రి కోసం ఉద్యమిద్దామన్నారు. ఎమ్మెల్యే అబ్రహాం, ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు అలంపూ రు పర్యటనకు వచ్చినప్పుడు వారిని అఖిలపక్షం ఆధ్వర్యంలో ముట్టడిస్తామ న్నారు. లాఠీలకు భయపడకుండా వంద పడకల ఆస్పత్రిని సాధించుకుందా మన్నారు.  సీపీఐ తాలూకా నాయకుడు పెద్దబాబు మాట్లాడుతూ వంద పడకల ఆస్పత్రిని ఎమ్మెల్యే, మంత్రి ఇద్దరూ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు లొంగిపోయారని అన్నారు. అలంపూరులో ఆస్పత్రి నిర్మాణానికి విడుదలైన జీవో నెం.98ని పక్కదారి పట్టించి రియల్‌ ఎస్టేట్‌ మాఫియాకు దాసోహమయ్యారని ఆరోపించారు. బీజేపీ నాయకులు మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అబ్రహాం, టీఆర్‌ఎస్‌ నాయకులు, పదవులు అనుభవిస్తున్న వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేసి అలంపూరులోనే  వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు అయ్యే వరకు తమ నిజాయితీని చాటుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆ ప్రాంతంలో వ్యవసాయ పొలాలను కొన్నారని, వాటి అభివృద్ధి కోసం అలంపూరు చౌరస్తాలో వంద పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయిస్తామని చెప్పారని అన్నారు.  మంత్రి, ఎమ్మెల్యే తమ లాభాల కోసం అలంపూరు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.  ఈ విషయమై  అలంపూరు ప్రజల తరఫున హైకోర్టులో పిటిషన్‌ వేస్తామని హెచ్చరించారు. అలంపూరుకు మంజూరైన అభివృద్ధి పథకాలను ఎమ్మెల్యే అబ్రహాం తన అఽధికార బలంతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయకుండా అన్ని పథకాలను తరలించుకుపోతున్నారని అఖిలపక్షం నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు ధర్మరాజు, వివేకానంద యూత్‌ నాయకులు రమణ, నాయుడు, యూటీఎఫ్‌ నాయకులు రమేష్‌, వెంకటేష్‌, కాంగ్రెస్‌ నాయకులు ఇంతియాజ్‌, బీజేపీ నాయకులు నాగమద్దిలేటి. టీడీపీ తాలూకా ఇన్‌చార్జి ఆంజనే యులు, పెద్దబాబు, రేపల్లె దేవదాసు, రైతుసంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-21T05:01:17+05:30 IST