ఒకే వెంటిలేటర్‌తో నలుగురికి

ABN , First Publish Date - 2020-03-30T09:55:32+05:30 IST

అమెరికాలో ప్రస్తుతం వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. దీని నుంచి గట్టెక్కడానికి ప్రిస్మా హెల్త్‌ కంపెనీ కొత్తరకం

ఒకే వెంటిలేటర్‌తో నలుగురికి

  • అత్యవసరమైతేనే వినియోగం


న్యూయార్క్‌, మార్చి 29: అమెరికాలో ప్రస్తుతం వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంది. ఆసుపత్రులలో చేరేవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. దీని నుంచి గట్టెక్కడానికి ప్రిస్మా హెల్త్‌ కంపెనీ కొత్తరకం వెంటిలేటర్‌ను కనిపెట్టింది. అత్యవసర సమయంలో ఒకే వెంటిలేటర్‌ ద్వారా నలుగురికి చికిత్స అందించే విధంగా దీన్ని రూపొందించింది. వైరస్‌, బ్యాక్టీరియాలు ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఐఎ్‌సఓ ప్రమాణాలతో తయారుచేసింది. సోర్స్‌ కోడ్‌, త్రీడీ ప్రింటింగ్‌ సాంకేతికను దీనికి ఉపయోగించారు. దీనికి ఎఫ్‌డీఏ అనుమతి కూడా లభించింది. 

Updated Date - 2020-03-30T09:55:32+05:30 IST