శిథిలమైన హాస్టల్‌ భవనాలను పునర్నిర్మించండి

ABN , First Publish Date - 2021-04-16T06:04:47+05:30 IST

కోరుకొండలోని ఎస్సీ బాలుర, బాలికల భవనాలు శిధిలావస్థకు చేరాయని అందువల్ల వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించా లని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మోనిటరింగ్‌ కమిటీ అభిప్రాయపడింది.

శిథిలమైన హాస్టల్‌ భవనాలను పునర్నిర్మించండి

కోరుకొండ, ఏప్రిల్‌ 15: కోరుకొండలోని ఎస్సీ బాలుర, బాలికల భవనాలు శిధిలావస్థకు చేరాయని అందువల్ల వాటి స్థానంలో కొత్త భవనాలు నిర్మించా లని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్‌ అండ్‌ మోనిటరింగ్‌ కమిటీ అభిప్రాయపడింది. గురువారం సాయంత్రం కమిటీ సభ్యుడు కొమ్ము  చినబాబు, ఎస్సీ బాలుర, బాలికల హాస్టల్స్‌ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ శిథిలావస్థలో ఉన్న హాస్టల్‌ భవనాల స్థానంలో కొత్త భవనాలు నిర్మించాలని జిల్లా కలెక్టర్‌కు, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి పినిపే విశ్వరూప్‌ దృష్టికి తీసుకెళతామన్నారు. ప్రస్తుతం కోరుకొండలో వలే జిల్లాలో కూడా అనేక ఎస్సీ బాలుర, బాలికల వసతి గృహాలు శిథిలావస్థకు చేరుకున్నాయని వీటిని కూడా పరిశీలిస్తామని వారు చెప్పారు. ఈ సందర్భంగా హాస్టల్‌ విద్యార్థులతో మోనటరింగ్‌ కమిటీ ముఖాముఖిగా మాట్లాడారు. ప్రభుత్వం ఇచ్చే నిధులు పిల్లలకు సక్రమంగా అమలు చేయాలని కమిటీ అభిప్రాయపడింది. ఇటీవల సాంఘిక సంక్షేమ హాస్టల్స్‌ స్థితిగతులపై ఆంధ్ర జ్యోతి పరిశోధనాత్మక కథనాలను ప్రచురించడం పట్ల ఆయన అభినందిం చారు. కార్యక్రమంలో హాస్టల్‌ వార్డెన్స్‌ గొల్ల జాన్‌బాబు, సత్యనారాయణ, రాణి, వేమగిరి నాగ సత్యనారాయణ, పీవీ సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-16T06:04:47+05:30 IST