‘హాట్‌’షాట్స్‌!

ABN , First Publish Date - 2020-07-11T06:29:30+05:30 IST

టిక్‌టాక్‌పై నిషేధం పడడంతో వినియోగ దారులు ఆ తరహా యాప్‌ల కోసం వెతకడం ఎక్కువయింది. చింగారీ యాప్‌ డౌన్‌లోడ్‌ల సంఖ్య అమాంతం పెరగడం తెలిసిందే. టిక్‌టాక్‌ లోటును భర్తీ చేయడానికి మ్యూజిక్‌ యాప్‌ అయినటువంటి ‘గానా’ కూడా ‘హాట్‌షాట్స్‌’

‘హాట్‌’షాట్స్‌!

టిక్‌టాక్‌పై నిషేధం పడడంతో వినియోగ దారులు ఆ తరహా యాప్‌ల కోసం వెతకడం ఎక్కువయింది. చింగారీ యాప్‌ డౌన్‌లోడ్‌ల సంఖ్య అమాంతం పెరగడం తెలిసిందే. టిక్‌టాక్‌ లోటును భర్తీ చేయడానికి మ్యూజిక్‌ యాప్‌ అయినటువంటి ‘గానా’ కూడా ‘హాట్‌షాట్స్‌’ పేరుతో ఓ కొత్త యాప్‌ను విడుదల చేసింది. టిక్‌టాక్‌పై నిషేధం వల్ల కొన్ని లక్షల మంది వినియోగదారులు వీడియోలు క్రియేట్‌ చేయడానికి, షేర్‌ చేయడానికి అనువైన ప్లాట్‌ఫామ్‌ కోసం వెతుకుతున్నారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవడం కోసం గానా ‘హాట్‌షాట్స్‌’ యాప్‌ను తీసుకొచ్చింది. చిన్న చిన్న వీడియోలు క్రియేట్‌ చేయడానికి, షేర్‌ చేయడానికి ఈ యాప్‌ చక్కగా ఉపయోగపడుతుందని రూపకర్తలు అంటున్నారు.

Updated Date - 2020-07-11T06:29:30+05:30 IST