Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 15 2021 @ 11:08AM

హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం... ఇద్దరు సజీవ దహనం!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో గల కృష్ణా హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమవగా, వారి మృతదేహాలు అగ్నిమాపక సిబ్బంది వెలికి తీసుకువచ్చారు. 

అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం ఈరోజు ఉదయం 7 గంటల 25 నిముషాలకు జరిగింది. ఈ ఘటనతో ఈ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు మాట్లాడుతూ ఈ ప్రమాదం కారణంగా సంభవించిన ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదని,  ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Advertisement
Advertisement