Advertisement
Advertisement
Abn logo
Advertisement

వెడ్డింగ్ కేక్ కట్ చేసేందుకు వధూవరులు వెయింటింగ్.. ఇంతలో షాకింగ్ ఘటన.. అసలు ట్విస్ట్ ఏంటంటే..

ఓ ఫైవ్‌స్టార్ హోటళ్లో వారి వివాహ వేడుక గ్రాండ్‌గా ముగిసింది.. అతిథుల ముందు వెడ్డింగ్ కేక్ కట్ చేయడమే మిగిలింది.. అందుకోసం వధూవరులిద్దరూ ఎదురుచూస్తున్నారు.. హోటల్ సిబ్బంది వేదిక వద్దకు భారీ కేక్‌ను తీసుకొస్తున్నారు.. అయితే ప్రమాదవశాత్తూ అది కిందపడిపోయింది.. దీంతో అందరూ షాకయ్యారు.. వరుడికైతే కన్నీళ్లే మిగిలాయి.. ఆ సమయంలో అసలు విషయం బయటపడింది.. వధూవరులను ఆటపట్టించేందుకు హోటల్ యాజమాన్యం చేసిన ప్రాంక్ అది అని తేలింది. 


లండన్‌లోని ఓ వివాహ వేదిక వద్ద ఈ ఘటన జరిగింది. `షీ షెడ్ యస్` అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశారు. వేదిక వద్దకు హోటల్ సిబ్బంది భారీ కేక్‌ను తీసుకొస్తుండగా అది పడిపోయింది. దీంతో అక్కడున్న అందరూ షాకయ్యారు. అయితే సిబ్బంది చేతుల నుంచి పడిపోయింది నిజమైన కేక్ కాదు! వధూవరులను ఆటపట్టించేందుకు హోటల్ సిబ్బంది చేసిన ప్రాంక్‌ అది. అసలు వెడ్డింగ్ కేక్‌ను వారు వెంటనే వధూవరుల ముందుకు తీసుకువచ్చారు. ఆశ్చర్యపోయిన వధూవరులు కేక్ కట్ చేసి, డ్యాన్స్ చేశారు. ఈ వీడియోను ఇప్పటికే సుమారు 2 మిలియన్ల మంది వీక్షించారు. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement