Abn logo
Aug 2 2021 @ 01:46AM

సిక్కిం సెక్టారులో భారత్‌, చైనా ఆర్మీల హాట్‌లైన్‌

న్యూఢిల్లీ, ఆగస్టు 1: ఉత్తర సిక్కిం సెక్టారులో భారత్‌, చైనా ఆర్మీల మధ్య ఒక హాట్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతంలో వాస్తవాధీన రేఖ వెంబడి విశ్వాసాన్ని మరింతగా పెంపొందించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్టు అధికారులు ఆదివారం తెలిపారు. ఈ హాట్‌లైన్‌ ప్రారంభోత్సవానికి రెండు ఆర్మీల గ్రౌండ్‌ కమాండర్లు హాజరైనట్టు ఆర్మీ తెలిపింది. స్నేహం, సామస్యానికి సంబంధించిన సందేశాన్ని పంచుకున్నట్టు పేర్కొంది. ఈ హాట్‌లైన్‌ ద్వారా లోకల్‌ కమాండర్లు నేరుగా మాట్లాడుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. వాస్తవాధీన రేఖ వెంబడి ఏమైనా సమస్యలు ఎదురైతే పరిష్కరించడానికి దోహదపడుతుందని అధికారులు పేర్కొన్నారు.