Abn logo
Sep 22 2021 @ 23:03PM

హవర్లీ బేస్డ్‌ టీచర్లను కొనసాగించాలి

ఆందోళనకారులతో మాట్లాడుతున్న కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

సిర్పూర్‌(యూ), సెప్టెంబరు 22: మండల కేంద్రంలోని మోడల్‌ స్కూ ళ్లలో పనిచేస్తున్న అవర్లీబేసిక్‌ టీచ ర్లను విధుల్లో కొనసాగిం చాలని తుడుందెబ్బ, ఏజెన్సీషెడ్యూల్‌ కులాల ఐక్యవేదిక సంఘాల నాయకులు మాధవరావు, శ్రీనివాస్‌ కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ను కోరారు. బుధవారం మండలానికి కలెక్టర్‌ వస్తున్నట్లు తెలుసుకున్న నాయకులు రోడ్డుపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న కలెక్టర్‌ వారి వద్దకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకు న్నారు. ఈసందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ సమ స్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో వారు రాస్తారోకో విరమించారు. నరేష్‌, ధర్మారావు, ఇమ్రాన్‌, అశోక్‌, అమృత్‌ తదితరులు పాల్గొన్నారు.