టీడీపీ నేతల గృహ నిర్బంధం

ABN , First Publish Date - 2020-12-04T06:43:27+05:30 IST

చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లనీయకుండా మండల తెలుగు దేశం పార్టీ నేతలను పోలీసులు నిర్బంధించారు.

టీడీపీ నేతల గృహ నిర్బంధం
కైకలూరులో జయమంగళ

అవనిగడ్డ టౌన్‌, డిసెంబరు 3: చలో అసెంబ్లీ కార్యక్రమానికి వెళ్లనీయకుండా మండల తెలుగు దేశం పార్టీ నేతలను పోలీసులు  నిర్బంధించారు.  పోలీసులు నిర్బంధించిన వారిలో కొల్లూరి వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబు, మండలి రామ్మోహన్‌ రావు, కర్రా సుధాకర్‌, బండె రాఘవ, గాజుల మురళీ కృష్ణ, మేరుగు సోమిరెడ్డి, పులిగడ్డ నాంచారయ్య, చండ్ర వెంకటేశ్వరరావు, గొరిపర్తి ఈశ్వర్‌, పరిశె వెంకటేశ్వర రావు, రేపల్లె అంకినీడు తదితరులు ఉన్నారు. కైకలూరు  : చలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలివె ళుతున్న మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణను  పోలీసులు హౌస్‌ అరెస్టు చేశారు.  ఎస్సై షణ్ముఖ సాయి ఆధ్వర్యంలో  ఉదయం 5 గంటలకే జయమంగళను  బయటకు  రాకుండా అడ్డుకు న్నారు. కొద్దిసేపటి అనంతరం మండల పార్టీ అధ్యక్షుడు  పెన్మెత్స త్రినాథరాజు,  పోలవరపు లక్ష్మీరాణి,  పైడిమర్రి మాల్యాద్రి తదితర నాయకు లతో కలిసి  అమరావతి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. నాగాయలంక  : చలో అసెంబ్లీకి వెళ్తున్న టీడీపీ బందరు పార్లమెంట్‌ మహిళా అధ్యక్షురాలు తలశిల స్వర్ణలతను నాగా యలంక పోలీసులు  గృహనిర్బంధం చేశారు. మహిళా నేతకు నోటీసులు ఇచ్చారు. గుడివాడటౌన్‌/ గుడివాడ రూరల్‌  :  పట్టణ టీడీపీ మైనార్టీ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్‌ అరెస్టు చేశారు. మైనార్టీ నాయకులు జానీ షరీఫ్‌, సయ్యద్‌ జబిన్‌, కరీముల్లా, షేక్‌ సర్కార్‌, టీడీపీ పట్టణ మాజీ ఉపాధ్యక్షుడు ముళ్ళపూడి రమేష్‌చౌదరి, మల్లాయ పాలెం మాజీ సర్పంచ్‌ సాబెరుల్లా బేగ్‌, మండల టీడీపీ అధ్యక్షుడు వాసే మురళిలను పోలీసులు  గృహ నిర్బంధం చేశారు. 

  





Updated Date - 2020-12-04T06:43:27+05:30 IST