గృహనిర్మాణ పనులు వేగవంతం చేయండి

ABN , First Publish Date - 2021-06-19T04:50:32+05:30 IST

గృహనిర్మాణ పనులను వేగవంతం చేయాల్సిందిగా కలెక్టరు చక్రధర్‌బాబు అధికారులను కోరారు.

గృహనిర్మాణ పనులు వేగవంతం చేయండి
లేఅవుట్‌ పరిశీలిస్తున్న కలెక్టరు చక్రధర్‌బాబు

కలెక్టరు చక్రధర్‌బాబు  


కోవూరు, జూన్‌ 18 : గృహనిర్మాణ పనులను వేగవంతం చేయాల్సిందిగా కలెక్టరు చక్రధర్‌బాబు అధికారులను కోరారు. మండలంలోని ఇనమడుగులో ఏర్పాటు చేస్తున్న లేఅవుట్‌ను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. లేఅవుట్‌లో  మౌలిక వసతులు కల్పించాల్సిందిగా ఆయా శాఖాధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రభుత్వం గృహనిర్మాణ పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందని, అన్ని శాఖల అధికారులు  పనులను సత్వరమే పూర్తి చేయాలన్నారు. ఆయన వెంట జడ్పీ సీఈవో సుశీల, తహసీల్దారు సుబ్బయ్య, ఎంపీడీవో శ్రీహరి, గృహనిర్మాణ శాఖ డీఈ జగదీశ్వరి, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ శాఖాధికారులు పాల్గొనారు. 

Updated Date - 2021-06-19T04:50:32+05:30 IST