Abn logo
Oct 23 2021 @ 10:11AM

మన్సూరాబాద్‌లో ఇంటి ఓనర్ దౌర్జన్యం

హైదరాబాద్: ఎల్బీనగర్ మన్సూరాబాద్‌లో ఇంటి ఓనర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి రౌడీమూకలతో కలిసి తాగొచ్చి కిరాయిదారులపై ఇంటి ఓనర్ క్రిష్ణ దాడికి యత్నించాడు. మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు. బీరు సీసాలతో దాడికి యత్నించాడు. 100 డయల్ చేసి పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేలోపు రౌడీమూకలు పారిపోయారు. ఇంటి ఓనర్ క్రిష్ణ వేధింపులపై రెండ్రోజుల క్రితమే పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే మరోమారు దాడికి పాల్పడ్డాడు. పోలీసులతోనూ క్రిష్ణ దురుసుగా మాట్లాడినట్టు తెలుస్తోంది.  

తెలంగాణ మరిన్ని...