రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయాలి

ABN , First Publish Date - 2020-11-26T06:19:03+05:30 IST

టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రూపాయికే ఇల్లు రిజిస్ర్టేషన్‌ చేయాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ కోరారు.

రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయాలి
సచివాలయం సెక్రటరీకి వినతిపత్రం అందజేస్తున్న దోనేపూడి శంకర్‌, పక్కన టీడీపీ నాయకులు ఇస్మాయేల్‌

రూపాయికే ఇల్లు రిజిస్ట్రేషన్‌ చేయాలి

సీపీఐ నగర కార్యదర్శి శంకర్‌

పాతరాజరాజేశ్వరిపేట, నవంబరు 25 : టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు రూపాయికే ఇల్లు రిజిస్ర్టేషన్‌ చేయాలని సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ కోరారు. బుధవారం పాతరాజరాజేశ్వరి పేటలోని సచివాలయంలో సెక్రటరీకి టిడ్కో ఇళ్ల  సమస్యపై  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌, మంత్రి వెలంపల్లికి చిత్తశుద్ధి ఉంటే  డిపాజిట్లు కట్టిన 11,500 మందికి రూపాయికే రిజిస్ట్రేషన్లు చేయాలని, వసతులు కల్పించాలని, కన్వేయన్స్‌ పట్టాలు ఇవ్వాలని శుక్ర వారం పెద్దఎత్తున లబ్ధిదారులతో కలిసి పాదయాత్ర చేపడుతున్నట్లు చెప్పారు. సీపీఐ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

విద్యాధరపురం: డిపాజిట్‌ చెల్లించిన లబ్ధిదారులందరికీ టిడ్కో ఇళ్లు రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలని కోరుతూ బుధవారం పాత 26, 33 డివిజన్ల సీపీఐ ఆధ్వర్యంలో విద్యాధరపురంలోని 116, 117, 118, 119 సచివాలయాల అడ్మిన్‌ కార్యదర్శులకు వినతి పత్రం అందజేశారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి జి.కోటేశ్వరరావు, నగర కార్యవర్గ సభ్యులు పంచదార్ల దుర్గాంబ, పార్టీ నాయకులు కంచర్ల నాగేశ్వరరావు, జి.సింహాచలం, వి.గోపి, ఎస్‌కె షంషూద్దీన్‌ సయ్యద్‌ అహ్మద్‌ ఆలీ, నాగమ్మ, రాంబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-26T06:19:03+05:30 IST