మాకొద్దీ ఇళ్ల పట్టాలు బాబోయ్‌

ABN , First Publish Date - 2021-04-14T06:06:02+05:30 IST

(అమలాపురం-ఆంధ్రజ్యోతి) వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా నిరుపేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థల పట్టాల పంపిణీపై ప్రజల్లో అప్పుడే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పట్టాలు ఇచ్చి స్థలాల వద్ద ఫొటోలు తీయించడం మినహా ఇప్పటివరకు తమకు ఆ స్థలాలను కూడా అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తీరు వారిలో ఆందోళనకు కారణమవుతోంది. ఒక గ్రామానికి చెందిన లబ్ధిదారులైతే తమ పట్టాల ప్రతులను తీసుకువెళ్లి

మాకొద్దీ ఇళ్ల పట్టాలు బాబోయ్‌
మామిడికుదురు తహశీల్దార్‌కు ఇళ్ల స్థల పట్టాలు తిరిగి ఇచ్చేస్తున్న మొగలికుదురు మహిళలు

లబ్ధిదారుల్లో తిరుగుబాటు

మొగలికుదురులో ఇళ్ల స్థల పట్టాలను 

తహశీల్దార్‌కు తిరిగిచ్చేసిన లబ్ధిదారులు

ఇదే బాటలో మరిన్ని గ్రామాల జనం 

స్థలాలు లేవు.. లేఅవుట్ల అభివృద్ధీ లేదు.. 

ఇల్లు కట్టుకునేది ఎలా అంటూ నిరసన


(అమలాపురం-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా నిరుపేదలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థల పట్టాల పంపిణీపై ప్రజల్లో అప్పుడే అసంతృప్తి జ్వాలలు ఎగసిపడుతున్నాయి. పట్టాలు ఇచ్చి స్థలాల వద్ద ఫొటోలు తీయించడం మినహా ఇప్పటివరకు తమకు ఆ స్థలాలను కూడా అప్పగించకుండా ఇబ్బందులకు గురిచేస్తున్న తీరు వారిలో ఆందోళనకు కారణమవుతోంది. ఒక గ్రామానికి చెందిన లబ్ధిదారులైతే తమ పట్టాల ప్రతులను తీసుకువెళ్లి ఏకంగా తహశీల్దార్‌కే అప్పగించి నిరసన తెలిపారు. ఇదే బాటలో రానున్న రోజుల్లో కోనసీమవ్యాప్తంగా అనేక గ్రామాల నుంచి ఇళ్ల స్థల పట్టాల పంపిణీ వ్యవహారంపై లబ్ధి దారులే తిరుగుబాటుచేసే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. పి.గన్నవరం నియోజక వర్గం పరిధిలోని మామిడికుదురు మండలం మొగలికుదురు గ్రామానికి చెందిన సుమారు 80 మందికి పైగా లబ్ధిదారులు తమకు ప్రభుత్వం కొన్ని నెలల కిందట పంపిణీ చేసిన ఇళ్ల స్థల పట్టాలతో తహశీల్దార్‌ కార్యాలయానికి ప్రదర్శనగా వెళ్లి వాటిని అందజేశారు. దీనికి కారణమేమిటంటే మొగలికుదురు గ్రామానికి చెందిన నిరుపేదలకు పది కిలోమీటర్ల దూరంలో ఉండే ఈదరాడ గ్రామంలో స్థలాన్ని సేకరించి ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వడమే. తాటిపాక సెంటర్‌లో నిత్యం ఏదో ఒక పని చేసుకుని బతికే తమకు పది కిలోమీటర్ల దూరంలో ఇళ్లస్థల పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టుకున్నా తమ జీవనోపాధికి గండిపడే అవకాశం ఉందన్న ఆక్రోశంతో లబ్ధిదారులు పట్టాలను అప్పగించారు. ఇదే పరిస్థితి మామిడికుదురు మండలంలోని అనేక గ్రామాల్లో ఉంది. నగరం గ్రామస్తులకు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే పాశర్లపూడిలంకలోను, మగటపల్లి గ్రామస్తులకు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈదరాడ గ్రామంలోను పట్టాలు ఇవ్వడం పట్ల అక్కడ లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఇక అమలాపురం రూరల్‌ మండ లం బండారులంక గ్రామంలో సేకరించిన స్థలం కొంతమంది లబ్ధిదారులకే సరిపోవ డంతో మిగిలిన లబ్ధిదారులకు ఇంతవరకు గ్రామంలో భూమి సేకరించకపోవడంతో పది కిలోమీటర్ల దూరంలో తాండవపల్లి వెళ్లాల్సిందిగా అధికారులు ఆదేశించినప్పటికీ తమకు పట్టాలు ఇక్కడే ఇవ్వాలని స్థానికులు డిమాండు చేస్తున్నారు.


అదేవిధంగా అమలాపురం పట్టణంలోని నిరుపేదలతోపాటు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన నిరుపేదలకు తాండవపల్లిలో సేకరించిన భూముల్లోనే ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చేందుకు అధికారులు నిర్ణయించారు. ఇంతవరకు ఆ సేకరించిన భూమిని మెరక చేయలేదు.ఈ తరహా పరిస్థితులు ఇప్పుడు గ్రామగ్రామాన ఉన్నాయి. ఎందుకంటే మే నెల నుంచి శంకుస్థాపనలకు ముహుర్తాలు ఉండడంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకుందా మనే ప్రయత్నాలకు అటు ప్రభుత్వం నుంచి సహకారంకాని, ఇటు రెవెన్యూశాఖ నుంచి ఇళ్లస్థలాలు, పట్టాలు అందకపోవడమే ప్రధాన కారణంగా ఉంది. పట్టాలు ఇచ్చిన లబ్ధి దారులు ప్రభుత్వమే ఇళ్లు కట్టి ఇవ్వాలని మెజార్టీ సభ్యులు కోరినప్పటికీ సవాలక్ష కార ణాలతో వాటిని తిరస్కరించారు. అభివృద్ధి చేసిన లేఅవుట్లలో తమ స్థలాలను తమకు అప్పగిస్తే ఇల్లు కట్టుకుంటామంటూ లబ్ధిదారులు ముందుకు వస్తున్నా ప్రభుత్వ అధికా రుల నుంచి సహకారం అందడం లేదంటూ ఆయా మండల తహశీల్దార్‌ కార్యాల యాల్లో వ్యక్తిగతంగా వినతిపత్రాలు అందిస్తున్నారు. మొత్తం మీద లబ్ధిదారుల్లో తిరుగు బాటు ప్రారంభం కావడం అధికార వైసీపీ నాయకుల్లో కలవరం కలిగిస్తోంది.

Updated Date - 2021-04-14T06:06:02+05:30 IST