Abn logo
May 17 2021 @ 06:36AM

నేటితో ఇంటింటి సర్వే పూర్తి

అమరావతి: జ్వరపీడితులను గుర్తించేందుకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఇంటింటి సర్వే చురుగ్గా సాగుతోందని వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ చెప్పారు. సోమవారం సాయంత్రానికి ఈ సర్వే పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు. మంగళగిరిలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి జ్వరపీడితులను గుర్తిస్తున్నారన్నారు. బాధితులకు ఏఎన్‌ఎంలు మందులు, ఐసోలేషన్‌ కిట్లు అందజేస్తారని చెప్పారు. ఇప్పటివరకు 39,000 మంది జ్వరపీడితులను గుర్తించామన్నారు. 

Advertisement