ఇంట్లో హఠాత్తుగా ఏర్పడిన గొయ్యి

ABN , First Publish Date - 2021-12-02T17:21:13+05:30 IST

చెంగల్పట్టు జిల్లాలో గత రెండు వారాలకు పైగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కార ణంగా జిల్లాలో ఉన్న చెరువుల్లో నీటిమట్టాలు పూర్తిసామర్ధ్యానికి పెరిగాయి. ఈ నేపథ్యంలో, నందివరం ఊరపాక్కం చెరువు

ఇంట్లో హఠాత్తుగా ఏర్పడిన గొయ్యి

ప్యారీస్‌(చెన్నై): చెంగల్పట్టు జిల్లాలో గత రెండు వారాలకు పైగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కార ణంగా జిల్లాలో ఉన్న చెరువుల్లో నీటిమట్టాలు పూర్తిసామర్ధ్యానికి పెరిగాయి. ఈ నేపథ్యంలో, నందివరం ఊరపాక్కం చెరువు నుంచివిడుదల చేస్తున్న మిగులు జలాలు జగదీశ్‌నగర్‌ ప్రాంతంలో ఉన్న నివాస ప్రాంతాల్లోకి చేరింది. మరోవైపు జగదీశ్‌నగర్‌ రెండవ వీధిలోని ఓ అపార్ట్‌మెంట్‌ వెనుక అడయార్‌ కాలువ ప్రవహిస్తోంది. ఈ కాలువలో వరద నీరు ఉధృత రూపం దాల్చడంతో కాలువ సమీపంలో నివసిస్తున్న గుణశేఖరన్‌ ఇంటి గదిలో హఠాత్తుగా పదడుగుల గొయ్యి ఏర్పడింది. దీని ద్వారా వరద నీరు రావడం చూసి గుణశేఖరన్‌ కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల నివసిస్తున్న వారు ఆందోళనకు గురయ్యారు.

Updated Date - 2021-12-02T17:21:13+05:30 IST