Karuruలో ఇంటిగోడ కూలి బాలుడి దుర్మరణం

ABN , First Publish Date - 2021-11-25T15:41:50+05:30 IST

కరూరులో ఇంటి గోడ కూలిపడిన దుర్ఘటనలో 11 యేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కరూరు పులియూరు సమీపం వెంటాపురంలోని ఓ ఇంటిలో ఆరుముగం (35) అనే ప్రైవేటు కంపెనీ

Karuruలో ఇంటిగోడ కూలి బాలుడి దుర్మరణం

చెన్నై: కరూరులో ఇంటి గోడ కూలిపడిన దుర్ఘటనలో 11 యేళ్ల బాలుడు మృతి చెందాడు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. కరూరు పులియూరు సమీపం వెంటాపురంలోని ఓ ఇంటిలో ఆరుముగం (35) అనే ప్రైవేటు కంపెనీ వాచ్‌మన్‌ నివసిస్తున్నారు. మంగళవారం రాత్రి ఆయన భార్య, కుమారులు ఆకాష్‌ (15), సునీల్‌ (11)తో నిద్రపోయారు. గౌండంపాళయంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆకాష్‌ పదో తరగతి, సునీల్‌ ఆరో తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం వేకువజామున 1.45 గంటల ప్రాంతంలో ఆ ఇంటి పక్కవాటు గోడ ఉన్నట్టుండి కూలి నిదురపోతున్న ఆ ఇద్దరు బాలురపై పడింది. ఈ సంఘటనలో సునీల్‌ అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అతడి సోదరుడు ఆకాష్‌ తీవ్రంగా గాయపడ్డారు. గోడ కూలిపడిన శబ్దం విని చుట్టుపక్కల ఇళ్లలో నివసిస్తున్నవారంతా పరుగెత్తుకెళ్ళి శిథిలాల మధ్య చిక్కుకున్నవారిని వెలికి తీశారు. ఈ సమాచారం తెలుసుకుని కరూరు పశుపతి పాళంయ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని విచారణ జరిపారు. ఈ విషయం తెలుసుకున్న ఆరుముగం బంధువులు బాలుడు సునీల్‌ మృతికి ప్రభుత్వం నష్ట పరిహారం చెల్లించాలంటూ పులియూరు పట్టణ పంచాయతీ కార్యాలయం ఎదుట తిరుచ్చి రహదారిలో రాస్తారోకో నిర్వహించారు.

Updated Date - 2021-11-25T15:41:50+05:30 IST