Abn logo
Aug 4 2021 @ 00:44AM

త్వరగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి

పూరగుట్టలో లేఅవుట్‌ మ్యాప్‌ను పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌

లే అవుట్‌లు పరిశీలించిన సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయిప్రవీణ్‌

మైలవరం రూరల్‌, ఆగస్టు 3: ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని సబ్‌ కలెక్టర్‌ సూర్యసాయి ప్రవీణ్‌ చంద్‌ అధికారులను ఆదేశించారు. మైలవరం పూరగుట్ట లేఅవుట్‌ను, చంద్రాలలోని పేదల నివేశన స్థలాలకు కోసం ఏర్పాటు చేసిన లే అవుట్‌ను ఆయన మంగళవారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈనెల 7 ఆషాఢ మాసం వెళ్లిపోయిన తర్వాత ఇళ్ల నిర్మాణానికి భూమి పూజ చేయాలని, ఒకే సారి రెండు వేల ఇళ్లు పూర్తి చేస్తే మంచి పేరు వస్తుందన్నారు. కరోనా నిబంధనలపై అధికారులతో సమీక్ష జరిపారు. థర్డ్‌ వేవ్‌ ఉన్నందున ప్రతి ఒక్కరూ విధిగా నిబంధనలు పాటించాలన్నారు. తహసీల్దార్‌ రోహిణీదేవి, హౌసింగ్‌ డీఈ నాగమల్లేశ్వరరావు, ఎంపీడీవో డి.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.