Abn logo
Sep 28 2021 @ 22:41PM

ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి

సిబ్బందితో మాట్లాడుతున్న జేసీ విదేహ్‌ఖరే

గూడూరు, సెప్టెంబరు 28: జగనన్న లేఅవుట్లలో  ఇంటి నిర్మాణాలను వేగవంతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ విదేహ్‌ఖరే అన్నారు. మంగళవారం గాంధీనగర్‌లోని లేఅవుట్‌ను ఆయన పరిశీలించి అధికారులకు పలు సూచనలు  ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేఅవుట్‌లలో లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలు చేపట్టేందుకు అవసరమైన వసతులను కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌, హౌసింగ్‌ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.