హౌసింగ్ సేల్స్... జనవరి-మార్చిలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు...

ABN , First Publish Date - 2021-04-09T21:17:15+05:30 IST

కరోనా నేపధ్యంలో కూడా హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగ సంస్థ ప్రాప్‌టైగర్ ఈ వివరాలను వెల్లడించింది.

హౌసింగ్ సేల్స్... జనవరి-మార్చిలో హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాల జోరు...

హైదరాబాద్ : కరోనా నేపధ్యంలో కూడా హైదరాబాద్‌లో ఇళ్లు కొనుగోలు చేసే వారి సంఖ్య భారీగా పెరిగింది. రియల్ ఎస్టేట్ రంగ సంస్థ ప్రాప్‌టైగర్ ఈ వివరాలను వెల్లడించింది. త్రైమాసికం ప్రాతిపదికన... జనవరి-మార్చి కాలంలో హౌసింగ్ సేల్స్ 12 శాతం పెరిగాయి. కరోనా నేపధ్యంలో... వివిధ రంగాల్లో డిమాండ్ పెంచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  పలు చర్యలు తీసుకుంటోన్న విషయం తెలిసిందే.  ఇందులో భాగంగా హౌసింగ్ సేల్స్ పెరిగేందుకు కూడా చర్యలు తీసుకున్నాయి. ఈ క్రమంలో గత కొద్ది రోజులుగా ఇళ్ళ కొనుగోళ్ళు పెరుగుతున్నాయి.


ఎనిమిది ప్రధాన మార్కెట్‌లలో హౌసింగ్ సేల్స్ జనవరి-మార్చి త్రైమాసికంలో పెరిగాయి. ఈ మేరకు ప్రోప్ టైగర్ తన రియల్ ఇన్-సైట్ క్యూ1సీవై21లో పేర్కొంది. ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో 66,176 ఇళ్ల విక్రయం జరిగింది.  త్రైమాసికం ప్రాతిపదికన మాత్రం... అంటే అక్టోబరు-డిసెంబరు త్రైమాసికంతో పోలిస్తే మాత్రం అమ్మకాలు 12 శాతం పెరిగాయి. 


హైదరాబాద్‌లో ఇళ్ల అమ్మకాలు...

హైదరాబాద్ నగరంలో 2020 జనవరి-మార్చిలో 5,554 ఇళ్లు, ఫ్లాట్లు విక్రయించగా, ఈ ఏడాది ఇదే సమయంలో 38 శాతం పెరిగి 7,721కు చేరాయని ప్రోప్ టైగర్ వెల్లడించింది. ఈ కాలంలోనే దేశవ్యాప్తంగా ఇళ్ల అమ్మకాలు 5 శాతం క్షీణించినట్లు వెల్లడించింది. ఎనిమిది పెద్ద నగరాల్లో గృహ విక్రయాల తీరుతెన్నులపై ప్రాప్ టైగర్ నివేదికను రూపొందించింది.


కొత్త లాంచింగ్స్...

జనవరి-మార్చి త్రైమాసికంలో దేశవ్యాప్తంగా 53,037 యూనిట్లు లాంచ్ అయ్యాయి. ఏడాది ప్రాతిపదికన ఈ వృద్ధి 49 శాతంగా ఉంది. త్రైమాసికం ప్రాతిపదికన మాత్రం 2 శాతం క్షీణించింది. కాగా... 2021 జనవరి-మార్చిలో దేశవ్యాప్తంగా 66,176 ఇళ్లు, ఫ్లాట్ల విక్రయం జరగగా, ఏడాది క్రితం ఈ సంఖ్య 69,555 గా ఉంది. అయితే ఈ ఎనిమిది నగరాల్లో అమ్మకాలు 29 శాతం పెరిగినట్లు అనరాక్ వెల్లడించింది. ఇక... 44 శాతం వృద్ధి కనిపించినట్లు నైట్ ఫ్రాంక్ సంస్థ పేర్కొంది. 

Updated Date - 2021-04-09T21:17:15+05:30 IST