ఇంటింటి సర్వేలో 224 బృందాలు

ABN , First Publish Date - 2021-05-11T06:27:34+05:30 IST

ఇంటింటి సర్వేలో 224 బృందాలు

ఇంటింటి సర్వేలో 224 బృందాలు

66 డివిజన్లలో వివరాల సేకరణ  


వైద్య ఆరోగ్య శాఖకు బల్దియా సహకారం


వరంగల్‌ సిటీ, మే 10 : కొవిడ్‌ నియంత్రణకు జిల్లా వై ద్య, ఆరోగ్య శాఖ చేపట్టిన ఇంటింటి సర్వేకు 224 బృందా లను ఏర్పాటు చేసింది. జీడబ్ల్యూఎంసీ సిబ్బంది వీరికి సహ కారం అందిస్తున్నారు. ప్రజారోగ్య సిబ్బంది, ఎస్‌ఎల్‌ఎఫ్‌ స భ్యులు నగరంలోని 66 డివిజన్లలో ఇంటింటికి వెళ్లి జ్వర ని ర్ధారణ పరీక్షలు చేస్తున్నారు. కరోనా లక్షణాలు ఉన్నవారికి మందుల కిట్‌ను అందజేస్తున్నారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది సూచనల మేరకు మందులను వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జ్వర బాధితులు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టిని సారించి సోడియం హైపో క్లోరైడ్‌ను పిచికారీ చేయించి, పారిశుధ్య కార్యక్రమాలు చేపడు తున్నారు. డివిజన్లలోని ప్రతీ ఇంటిని బృందం సందర్శించి వివరాలు సేకరిస్తోంది.

Updated Date - 2021-05-11T06:27:34+05:30 IST