Advertisement
Advertisement
Abn logo
Advertisement

కళ్లద్దాలు ఎత్తుకుపోయిన కోతి.. వాటిని వెనక్కి ఎలా తెచ్చుకున్నాడంటే..

ఇంటర్నెట్ డెస్క్: కోతులు అదో టైపు.. మనం ఏం చేస్తే దాన్ని అలాగే చేసేందుకు ట్రై చేస్తుంటాయి. వాటికున్న ఈ అలవాటునే తనకు అనుకూలంగా మలుచుకుని పోయిన కళ్లద్దాలను వెనక్కి తెచ్చుకున్నాడో వ్యక్తి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ ప్రభుత్వాధికారి దీన్ని షేర్ చేశారు. అసలేం జరిగిందంటే..ఓ కోతి ఓ వ్యక్తి కళ్లద్దాలను ఎత్తుకుపోయి.. ఎత్తుగా ఉన్న జాలీ ఎక్కి కూర్చుంది. కిందకు దిగకుండా అటు ఇటూ చూస్తుంది. దాని వాలకం చూస్తే అక్కడి కళ్లద్దాలతో సహా అక్కడి నుంచి పారిపోయేలాగా ఉంది. దీన్ని గమనించిన ఓ వ్యక్తి తన చేతిలో ఉన్న ఫ్రూటీ బాటిల్ దానికిచ్చాడు. కోతి దాన్ని లటుక్కున లాగేసుకుంది. ఆ తరువాత.. ఫ్రూటీ ఇవ్వు అంటూ కోతికి సైగ చేశాడు. అతడు ఊహించినట్టే కోతి కళ్లద్దాలను కిందకు విసిరేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది. 


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement