కరోనాను మొండిగా మార్చిన నిశ్శబ్ద జన్యుమార్పులివీ..

ABN , First Publish Date - 2020-10-20T09:56:19+05:30 IST

కరోనా వైరస్‌ ప్రమాదకర రూపును సంతరించుకోవడానికి.. మందులకు లొంగని మొండిఘటంలా మారడానికి ఊతమిచ్చిన

కరోనాను మొండిగా మార్చిన నిశ్శబ్ద జన్యుమార్పులివీ..

వాషింగ్టన్‌, అక్టోబరు 19: కరోనా వైరస్‌ ప్రమాదకర రూపును సంతరించుకోవడానికి.. మందులకు లొంగని మొండిఘటంలా మారడానికి ఊతమిచ్చిన ‘నిశ్శబ్ద’ జన్యుమార్పుల వివరాలు వెలుగుచూశాయి. అమెరికాలోని డ్యూక్‌ వర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో అందుకు సంబంధించిన కీలక సమాచారం వెల్లడైంది. ప్రధానంగా కరోనా జన్యుపదార్థంలోని మూడు భాగాల్లో మార్పులు జరిగాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వైర్‌సకు ఆయువు పట్టులాంటి స్పైక్‌ ప్రొటీన్‌లో ఒక మార్పు జరగగా.. మిగతా రెండు మార్పులు ‘ఎన్‌ఎ్‌సపీ4’, ‘ఎన్‌ఎ్‌సపీ16’ అనే ఆర్‌ఎన్‌ఏ అణువుల్లో జరిగాయని వెల్లడించారు. కొవిడ్‌-19 వైరస్‌ మనిషికి సోకగానే మొట్టమొదట అది ‘ఎన్‌ఎ్‌సపీ4’, ‘ఎన్‌ఎ్‌సపీ16’ ఆర్‌ఎన్‌ఏ మాలిక్యూల్స్‌ను విడుదల చేస్తుంది. ఆ తర్వాతే స్పైక్‌ ప్రొటీన్‌ పని మొదలవుతుంది. ఈనేపథ్యంలో వైరస్‌ ముందుగా విడుదల చేస్తున్న ఆ రెండు అణువుల ఆటకట్టించేలా ఔషధాలను అభివృద్ధిచేయాల్సి ఉంటుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. 

Updated Date - 2020-10-20T09:56:19+05:30 IST