టెస్లా అధినేత ట్వీట్.. మదుపర్లు బోల్తా! కంపెనీకి భారీగా లాభాలు!

ABN , First Publish Date - 2021-01-13T15:10:59+05:30 IST

టెస్లా అధినేత ట్వీట్‌‌తో పక్కదారి పట్టిపోయిన మదుపర్లు

టెస్లా అధినేత ట్వీట్.. మదుపర్లు బోల్తా! కంపెనీకి భారీగా లాభాలు!

న్యూఢిల్లీ: ‘సిగ్నల్ వాడండి..’ ఇది టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఇటీవల చేసిన ట్వీట్.. మహా ప్రభంజనాన్నే సృష్టించింది! వాట్సాప్ తీరుతో విసిగిపోయిన అనేక మంది వినియోగదారులు  సిగ్నల్‌కు మరలడంతో వాట్సాప్ మాతృత సంస్థ ఫేస్ బుక్‌లో కల్లోలం చెలరేగింది. ఒక్కసారిగా ‘సిగ్నల్’ దూసుకుపోయేలా చేసిన ట్వీట్ ఇదే. అయితే..దీని కారణంగానే కొందరు మదుపర్లు అనూహ్యంగా తప్పుదారి పట్టిపోయారు. సిగ్నల్ వాడండి.. అంటే సిగ్నల్ అడ్వాన్స్‌ అనే సంస్థ అని మదుపర్లు పొరబడ్డారు. దీంతో ఆ సంస్థలోకి భారీగా పెట్టుబడుల వచ్చిపడ్డాయి. కంపెనీ షేర్ ధర ఏకంగా ఆరు రెట్ల మేర పెరిగిపోయింది. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఆ కంపెనీ షేర్ల విలువ ఏకంగా 5100 శాతం మేర పెరిగి మార్కెట్ విలువ 390 మిలియన డాలర్లు చేరుకుంది. 


అయితే..ఎలాన్ మస్క్ ప్రస్తావించిన కంపెనీ సీగ్నల్ అడ్వాన్స్‌ కాదని అప్పటికే మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నప్పటికీ షేర్ల ధరలు మాత్రం అలా పెరుగుతూనే పోయాయి. ఈ నేపథ్యంలోనే సిగ్నల్ అడ్వాన్స్‌డ్ సీఈఓ స్వయంగా స్పందించారు. పెట్టుబడులు పెట్టే క్రమంలో అన్ని విషయాలూ క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు. సిగ్నల్ అడ్వాన్స్‌కు టెస్లాతో కానీ సిగ్నల్ యాప్‌తో కానీ ఎటువంటి సంబంధం లేదు. పెట్టుబడుల విషయంలో మదుపర్లు జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన ఓ బహిరంగ ప్రకటన విడుదల చేశారు.  

Updated Date - 2021-01-13T15:10:59+05:30 IST