ఇజ్రాయెల్.. ప్రపంచానికే రోల్ మోడల్! ఆ టీకా కార్యక్రమమే ఓ అద్భుతం!

ABN , First Publish Date - 2021-01-02T20:10:42+05:30 IST

ఇప్పటికే కరోనా మహమ్మారికి ఓ సంవత్సరం బలైపోయింది. రెండో ఏడాదిలో మాత్రం మానవాళి విజయం సాధించాలి..ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం ఇజ్రాయెల్ దూసుకుపోతుంది.

ఇజ్రాయెల్.. ప్రపంచానికే రోల్ మోడల్! ఆ టీకా కార్యక్రమమే ఓ అద్భుతం!

ఇంటర్నెట్ డెస్క్: ఇప్పటికే కరోనా మహమ్మారికి ఓ సంవత్సరం బలైపోయింది. రెండో ఏడాదిలో మాత్రం మానవాళి విజయం  సాధించాలి..ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం ఇజ్రాయెల్ దూసుకుపోతుంది. ప్రతి రోజు ఏకంగా 1.5 లక్షల మందికి టీకా వేస్తోంది. కేవలం ఒక్క రోజులోనే దేశజానభాలో 2 శాతం మందికి కరోనా నుంచి రక్షణ కల్పిస్తోంది. అత్యంత వేగవంతమైన టీకా కార్యకార్యక్రమం నిర్వహిస్తూ ప్రపంచ దేశాలకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. ఇజ్రాయెల్ జనాభా  దాదాపు 90 లక్షలు. ఈ వారాంతానికల్లా వీరిలో 10 శాతం మందికి టీకా వేయాలనేది లక్ష్యాన్ని అక్కడి ప్రభుత్వం నిర్దేశించుకుంది.


ఇది 24*7 ఆపరేషన్- అంటే రోజులో 24 గంటలూ నిరంతరంగా సాగే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. ఈ మహాక్రతువులో ప్రజల్ని భాగస్వాముల్ని చేసేందుకు ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు ఓ వాగ్దానం చేశారు. ప్రజలందరూ సహరకిస్తే..కరోనా కోరల్లోంచి బయటపడ్డ తొలి దేశంగా ఇజ్రాయెల్ అవతరిస్తుందని స్పష్టమైన ప్రకటన చేశారు. ప్రభుత్వం చొరవ..ప్రజల భాగస్వామ్యం కలగిసిన ఈ టీకా కార్యక్రమం ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది. అగ్రరాజ్యం అమెరికాకు కూడా సాధ్యకానిది ఇజ్రాయెల్ చేసి చూపిస్తోంది.


అసలు ఇటువంటి ఫీట్ ఎలా సాధ్యమైందంటే..

1.ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, జనాభా కూడా తక్కువే.. అప్పటికే అక్కడి ఆరోగ్య వ్యవస్థలు పూర్తి స్థాయిలో డిజిటలీకరణ చెందాయి. అంతా ఆన్‌లైన్! అందుకే..టీకా పంపిణీలో అగ్రరాజ్యం కూడా తిప్పలు పడుతున్నా ఇజ్రాయెల్ మాత్రం దూసుకుపోతోంది.


2. టీకా కార్యక్రమంలో అక్కడి మానవనరుల పాత్ర కూడా ఎంతో ఉంది. 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిర్వహిస్తున్న ఇన్సూరెన్స్ ఏజెన్సీ వద్ద తమ పేరు నమోదు చేసుకోవాలి. ఆదేశ పౌరులుగా ఇది వారి బాధ్యత! ఈ విషయంలో పౌరులకు సహాయం చేసేందుకు అక్కడి ప్రభుత్వం ఆర్మీ డాక్టర్లను కూడా రంగంలోకి దిపింది.


3.ఓవైపు కరోనా భూతం భయపెడుతున్న అనేక మందిలో టీకా అంటే విముఖత. శాస్త్రసాంకేతిక రంగాల్లో ముందున్న ఇజ్రెయెల్‌కూ ఈ జాడ్యం తప్పలేదు. అందుకే..టీకా కార్యక్రమానికి ముందే ఈ జాడ్యాన్ని తొలగించాలని అక్కడి ప్రభుత్వం. టీకా అనుకూల ప్రచార కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టింది. సామాజిక మాధ్యమాల్లో కరోనా వ్యాక్సిన్ వ్యతిరేక ప్రచారానికి పాల్పడే అకౌంట్లను తొలగించేసింది. దీంతో..  టీకా పట్ల ప్రజల్లో గూడుకట్టుకున్న విముఖతను తగ్గించడంలో సఫలీకృతమైంది. 


4.టీకా దిశగా ప్రజల్ని ప్రోత్సహించేందుకు అక్కడి ప్రభుత్వం మరో వినూత్న కాసాంప్ట్‌ను ప్రవేశపెట్టింది. అవే..గ్రీన్ పాస్‌పోర్ట్స్. కరోనా టీకా వేయించుకున్న వారందరికీ ప్రభుత్వం గ్రీన్ పాస్ పోర్ట్స్ పేరిట ప్రత్యేక ధృవీకరణ పత్రాలు ఇచ్చింది. ఇవి ఉన్నవారు దేశంలో ఎక్కడికైనా ఎటువంటి ఆంక్షలూ లేకుండా ప్రయాణించవచ్చు. నచ్చిన రెస్టారెంట్లో భోజనం చేయచ్చు. క్వారంటైన్‌లో ఉండాల్సిన అగత్యం తప్పుతుంది. ఇది కూడా ఊహించినట్టుగా మంచి ఫలితాలను ఇస్తోంది. ఈ పటిష్ట కార్యాచరణ కారణంగా ఇజ్రాయెల్ ప్రస్తుతం దూసుకుపోతుంది. ప్రపంచం దృష్టి తనపై పడేలా చేస్తోంది. 

Updated Date - 2021-01-02T20:10:42+05:30 IST