స్మార్ట్‌ఫోన్‌ ఎంత కాలం వాడొచ్చు?

ABN , First Publish Date - 2020-05-30T05:30:00+05:30 IST

ఒక స్మార్ట్‌ఫోన్‌ ఎంత కాలం పాటు పనిచేస్తుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి?

స్మార్ట్‌ఫోన్‌ ఎంత కాలం వాడొచ్చు?

ఒక స్మార్ట్‌ఫోన్‌ ఎంత కాలం పాటు పనిచేస్తుంది? ఎలాంటి సమస్యలు వస్తాయి? 

రాజశేఖర్‌


భౌతికంగా దెబ్బతినకపోతే స్మార్ట్‌ఫోన్‌ ఎంతకాలమైనా వాడొచ్చు. సాఫ్ట్‌వేర్‌ పరంగా చూస్తే ఆపరేటింగ్‌ సిస్టమ్‌ అప్‌డేట్స్‌ ఒకటి రెండు సంవత్సరాల తర్వాత లభించకపోవచ్చు. అలాగే మెల్లగా కొన్ని అప్లికేషన్లు కంపాటబులిటీ ఉండకపోవచ్చు. అన్నిటికన్నా ప్రధానమైన సమస్య ఫోన్‌ బ్యాటరీ. మొత్తం 1000 ఛార్జింగ్‌ సైకిల్స్‌ని మాత్రమే  ఫోన్‌ బ్యాటరీ కలిగి ఉంటుంది. రోజుకి ఒకసారి 0 నుండి 100 శాతం ఛార్జింగ్‌ చేస్తారు అనుకుంటే గరిష్ఠంగా మూడు సంవత్సరాల పాటు బ్యాటరీ పని చేస్తుంది. ఆ తరువాత బ్యాటరీ మార్పించుకోగలిగితే ఫోన్‌  మరింత కాలం వస్తుంది. ఒకవేళ ఫోన్‌ వాడకుండా పక్కనపెడితే, అప్పుడు వాతావరణ మార్పులకు లోనై బటన్స్‌ దెబ్బ తినడం గానీ, లోపల మదర్‌బోర్డ్‌ మీద తేమ చేరడం గానీ జరుగుతుంది. మామూలుగా రోజు వాడితే మాత్రం ఇలాంటి సమస్యలు ఉండవు.

Updated Date - 2020-05-30T05:30:00+05:30 IST