మురుగునీటితో ఎన్ని ఇక్కట్లో..?

ABN , First Publish Date - 2021-10-28T05:04:23+05:30 IST

ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాం తాలు మురుగునీరు, వర్షపునీటితో కలిసి నెలలతరబడి చెరువులు, కుంటల ను తలపిస్తున్నాయి.

మురుగునీటితో ఎన్ని ఇక్కట్లో..?
మురుగు కుంటను తలపిస్తున్న ప్రకా్‌షనగర్‌లో రోడ్డు

ఎర్రగుంట్ల, అక్టోబరు 27: ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాం తాలు మురుగునీరు, వర్షపునీటితో కలిసి నెలలతరబడి చెరువులు, కుంటల ను తలపిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రకాష్‌నగర్‌లోని ఓ వీధిలో  ప్రధాన రోడ్లు ఎత్తు చేయడంతో రెండు రోడ్ల కనెక్టివిటీలో నిత్యం నీరు నిలిచి దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో రెండు వీధుల్లో నివసించేవారి పిల్లలు అవలివైపు ఉన్న పాఠశాలకు వెళాళ్లంటే దారి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పందుల గుంపు భారీగా ఉండ డం వల్ల విద్యార్థులు ఆ రోడ్డు వెంబడి వెళ్లేందుకు భయపడుతున్నారు. గతంలో బహిర్భూమికి వెళ్లిన ఓ మహిళను పందులు కరచి చంపిన దుర్గటన ఆ ప్రాంత వాసులు ఇప్పటికి మరువలేదు. దీంతో అక్కడి ప్రజలు దారి బాగుచేయాలని కమిషనర్‌కు, ఇతర అధికారులు అనేక సార్లు విజ్ఞప్తి  చేసినా పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. జగనన్న కాలనీలో ఉన్న మట్టిని అక్కడికి తోలి వెంటనే రోడ్డును బాగుచేయాలని, లేదంటే తానే సొంతంగా ట్రాక్టర్‌తో మట్టితోలిస్తానని 1 వార్డు కౌన్సిలర్‌ తనయుడు అడిగినా పట్టించుకోవడంలేదని పేర్కొంటున్నారు. కడప స్పందనలో కలెక్టర్‌ దృష్టికి  తీసువెళ్తామని ఆ ప్రాంత వాసులు పేర్కొంటున్నారు.


ముద్దనూరులోనూ..  ఇదే పరిస్థితి

ముద్దనూరు అక్టోబరు25: మండలంలో ఎక్కడ చూసిన వర్షపునీరు మురు గునీటితో కలిసి రోడ్లపైనే రోజుల తరబడి నిలవడంతో దుర్గంధం వెదజ ల్లుతోంది. దీంతో ప్రజలు, వాహనదారులు ఆ రోడ్లపై నడవాలంటే భయప డిపోతున్నారు మండల కేంద్రంలో పలు చోట్ల సిమెంటు రోడ్లు మురుగు కుంటలుగా దర్శనమిస్తున్నాయి. పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా కొత్తకొట్టాలు వీధిలోకి వెళ్లు రోడ్డు అధ్వానంగా ఉంది. ఈ రహదారి నుంచి కాలేజీకి విద్యార్థులు వెళుతుంటారు. కొత్తకొట్టాలు వీధిలో నడవాలన్నా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు.  ఇక పోతే పాత వీధి రైల్వే బిడ్జి సమీపంలో డ్రైనేజీ నీరు రోడ్డు పై ప్రవహిస్తుంది. పాత వీధి, రజకుల వీధిలోని మురుగు నీరు కాల్వ గుండా వచ్చి బిడ్జి సమీపంలోకి చేరుతుంది. ఈ మార్గం గుండా ఎస్వీగిరి కాలని, ఎల్‌ఎం కాం పాండ్‌లోని విద్యార్థులు బాలికల ఉన్నత పాఠశాలకు వెళుతుంటారు. రోడ్డు మురుగుగా ఉండడంతో పాఠశాలకు వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.



Updated Date - 2021-10-28T05:04:23+05:30 IST