Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంకెన్నాళ్లు మైనార్టీలను మోసగిస్తారు?

  1. నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ 


నంద్యాల టౌన్‌, నవంబరు 30: రాష్ట్రంలోని మైనార్టీలను ఇంకెన్నాళ్లు మోసగిస్తారని, వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న మైనార్టీ, ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల నుంచి తిరుగుబాటు తప్పదని నంద్యాల పార్లమెంట్‌ టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎండీ ఫిరోజ్‌ అన్నారు. మంగళవారం స్థానిక టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఫిరోజ్‌ మాట్లాడుతూ మైనార్టీ కార్పొరేషన్‌ నిధులను పక్కదారి పట్టించడమే కాకుండా మైనార్టీలకు సంక్షేమం జరిగిందని వైసీపీ ప్రభు త్వం ఊకదంపుడు ప్రకటనలు చేయడం  హాస్యాస్పందంగా ఉందన్నారు. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అంజాద్‌బాషా ఇటీవల మైనార్టీల సంక్షేమానికి రూ.8వేల కోట్లు ఖర్చు చేశామంటూ, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని ఆకాశానికి ఎత్తి పొగడ్తలు గుప్పించడం సిగ్గుచేటన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అమలు చేసిన మైనార్టీ సంక్షేమ పథకాలను కొనసాగించకుండా నిలిపివేసి, కొత్త పథకాలకు పాతర వేశారన్నారు. రంజాన్‌ తోఫా, దుఖాన్‌ మఖాన్‌, విదేశీ విద్య, షాదీముబారక్‌ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రంలో 44లక్షల మంది మైనార్టీలుంటే, 43లక్షల మందికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయని సీఎం జగన్‌ చెప్పడం బూటకమన్నారు. ఈసమావేశంలో టీడీపీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. Advertisement
Advertisement