Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆమెకు స్కూల్ వయసు నుంచే పెళ్లిళ్లంటే ఇష్టం.. స్నేహితులపై ప్రేమ.. ఇంతవరకు ఎంతమందిని చేసుకుందంటే..

ఆడవారిని అర్థం చేసుకోవాలంటే చాలా కష్టం. ఒక్కొక్కరు ఒక్కోలా ప్రవర్తిస్తుంటారు. కొందరి అభిరుచులు, అలవాట్లు వింతగా ఉంటాయి. అలాంటి వారిని చూస్తే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఇక విదేశాల్లో నివసించే ఆడవారు ఎలా ఉంటారో తెలిసిందే. అమెరికాకు చెందిన ఓ 52ఏళ్ల మహిళకు స్కూల్ వయసు నుంచే పెళ్లిళ్లు చేసుకోవడమంటే చాలా ఇష్టమట. దీంతో తన సోదరుడి స్నేహితులపై ప్రేమ పెంచుకుంది. తర్వాత ఎంతమందితో.. ఎన్ని పెళ్లిళ్లు చేసుకుందో తెలిస్తే షాక్ అవుతారు..

ప్రతీకాత్మక చిత్రం

అమెరికాలో ఉంటున్న మోనెట్(52) అనే మహిళ అభిరుచులు చాలా విభిన్నంగా ఉన్నాయి. మన దేశంలోని ఆడవారు.. ఒకరినే పెళ్లి చేసుకుని, వారితోనే జీవితాంతం కలిసి నడవాలనుకుంటారు. కానీ ఈ ఆమెరికా మహిళకు మాత్రం పెళ్లిళ్లంటే చిన్నప్పటి నుంచే ఎంతో ఇష్టం ఉండేదట. స్కూల్‌కు వెళ్తున్నప్పటి నుంచి తన సోదరుడి స్నేహితులతో పరిచయం పెంచుకుంది. వారినే మార్చి మార్చి పెళ్లి చేసుకోవాలని అనుకుంది. రోజూ ఇవే కలలు కంటూ ఉండేది. హైస్కూల్ చదువు పూర్తయిన వెంటనే తన కలను నెరవేర్చుకునేందుకు కంకణం కట్టుకుంది.

ముందుగా తన సోదరుడి స్నేహితుల్లో మంచి గుణాలున్న వారిలో ఒకరిని ఎంచుకుని పెళ్లి చేసుకుంది. తనతో కొన్నాళ్లు సంసారం చేశాక.. మళ్లీ ఇంకొకరిని పెళ్లి చేసుకుంది. ఇలా ఆమె పెళ్లిళ్ల పరంపర.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. 52 ఏళ్ల వయసుకు వచ్చే సరికి.. 9మందితో 11సార్లు వివాహం చేసుకుంది. ఇప్పటికీ ఆమె మరో పెళ్లి చేసుకోవాలని చూస్తోంది. నంబర్ల వారీగా తన భర్తల్లోని గుణాలు, స్వభావాలను వివరిస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఆమె 57ఏళ్ల జాన్‌తో డేటింగ్ చేస్తోంది. త్వరలోనే 12వ వివాహం చేసుకోనున్నట్లు మోనెట్ చెబుతోంది.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement