రెవెన్యూ వివాదాలు ఎన్ని పరిష్కరించారు?

ABN , First Publish Date - 2021-03-03T08:46:14+05:30 IST

రెవె న్యూ వివాదాల పరిష్కారానికి కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ ట్రైబ్యునళ్లలో ఇంతవరకు వరకు ఎన్ని కేసులు పరిష్కరించారు..

రెవెన్యూ వివాదాలు ఎన్ని పరిష్కరించారు?

జిల్లాల వారీగా వివరాలివ్వండి

ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఎట్టకేలకు కంపెనీలు/సంస్థల పాస్‌పుస్తకాల కోసం ధరణిలో ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చారు. జనవరి 15న కంపెనీలకు పాస్‌పుస్తకాలపై మార్గదర్శకాలు జారీ అయినా సాంకేతిక సమస్యల వల్ల ఈ ఆప్షన్‌ ముందుకెళ్లలేదు. తాజాగా ఇబ్బందులను అధిగమించి.. ఆప్షన్‌ను అందుబాటులో పెట్టారు.  సర్క్యులర్‌ నం.1తో పాస్‌పుస్తకాల జారీకి మార్గదర్శకాలు విడుదల చేయడంతో వీరికి రూట్‌ క్లియరైంది. 


హైదరాబాద్‌, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): రెవె న్యూ వివాదాల పరిష్కారానికి కొత్తగా ఏర్పాటు చేసిన రెవెన్యూ ట్రైబ్యునళ్లలో ఇంతవరకు వరకు ఎన్ని కేసులు పరిష్కరించారు? ఎన్ని కేసులు బది లీ చేశారు? ఎన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయో జిల్లాల వారీగా వివరిస్తూ పట్టిక (టేబుల్‌) రూపంలో కోర్టు ముందుంచాలని హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొత్త చట్టాన్ని ప్రభుత్వం ఏ ఉద్దేశంతో చేసిందో తాము అర్థం చేసుకోగలమని, అయితే ఎదుటి పక్షాల వాదనలకు అవకాశం ఇవ్వకుండా ఆదరాబాదరాగా అమలుచేస్తే అసలు చట్టానికే ఎసరు వస్తుందని అభిప్రాయపడింది. ఈ వ్యాజ్యం విచారణలో ఉం డగా ట్రైబ్యునళ్లు ఇచ్చే తీర్పులను నిలిపి వేయాల న్న పిటిషనర్‌ అభ్యర్థనను తోసిపుచ్చిన ధర్మాసనం...ఇవి పరిష్కరించిన వివాదాలు ఈ వ్యాజ్యం లో వచ్చే తుదితీర్పునకు లోబడే ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లీ, జస్టిస్‌ బి. విజయ్‌సేన్‌రెడ్డితో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశాలు జారీచేసింది. 

Updated Date - 2021-03-03T08:46:14+05:30 IST